పెను కలకలం.. కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు

పెను కలకలం.. కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు

మహారాష్ట్ర పూణేలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు పెను కలకలం రేపాయి. పూణె-సోలాపూర్ రోడ్డులో ఉన్న కుర్కుంభ్‌ పారిశ్రామికవాడలో ప్రమాదం కావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి 4 గంటలకు పైగా సమయం పట్టింది. తెల్లవారుజామన 2 గంటలకు ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడడం గుర్తించి సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ప్రమదానికి కారణాలేంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అధికంగా కెమికల్స్ నిల్వఉంచడం వల్లే మంటల తీవ్రత పెరిగందా, అసలేం జరిగింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story