Live In Relationship: అది సహజీవనం కాదు.. వ్యభిచారమే

Live In Relationship:  అది సహజీవనం కాదు.. వ్యభిచారమే
పంజాబ్-హర్యానా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వకుండా మరొకరితో స్వేచ్ఛా జీవితం గడపటం సహజీవనంగా పరిగణించరాదని పంజాబ్‌, హరియాణా ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. పంజాబ్‌కు చెందిన ఓ జంట తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కుల్దీప్‌ తివారీతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. సహజీవనంలో ఉన్న తమపై.. దాడులు చేస్తామంటూ బంధువుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో సహజీవనం చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. విడాకులివ్వకుండా వేరే వ్యక్తితో స్వేచ్ఛాయుత జీవితం గడపటం సహజీవనం కాదనీ. దీనిని నేరం కింద పరిగణిస్తున్నట్లు తెలిపింది. పిటిషనర్ల ప్రాణాలకు ముప్పు ఉందన్న వాదనలకు... సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టేస్తున్నట్లు తీర్పిచ్చింది.

కేసు వివరాల్లోకి వెళితే పంజాబ్‌కు చెందిన ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనంలో ఉన్నారు. మహిళ అవివాహిత కాగా, పురుషుడికి వివాహమైంది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యతో మనస్పర్థల నేపథ్యంలో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సహజీవనంలో ఉంటున్న అవివాహిత మహిళ, పురుషుడు ఇటీవల అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ ప్రాణాలకు రక్షణ, స్వేచ్ఛ కల్పించాలని వారు అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ కుల్దీప్‌ తివారీతో కూడిన ఏకసభ్య ధర్మాసనం మునుపటి బంధం నుంచి విడాకులు పొందకుండా వేరొక మహిళతో పిటిషనర్‌ కామంతో కూడిన, వ్యభిచార జీవితాన్ని గడుపుతున్నాడని పేర్కొంది. ఇది శిక్షార్హమైన నేరమే అవుతుందని తెలిపింది. అంతేగాక తమ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పే ఆధారాలేమీ పిటిషనర్లు చూపించలేదని పేర్కొంది. కేవలం వ్యభిచారం కేసులో విచారణను తప్పించుకోవడానికే ఈ పిటిషన్‌ వేసినట్లు కనిపిస్తోందని ఈ కేసును విచారించిన న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.

పురుషుడు విడాకులు తీసుకోకుండా అమ్మాయితో కామంతో కూడిన వ్యభిచార జీవితాన్ని గడుపుతున్నాడని, ఐసీసీ సెక్షన్ 494/495 ప్రకారం.. ఇది శిక్షార్హమైన నేరమే అవుతుందని స్పష్టం చేసారు. వ్యభిచారం కేసులో విచారణను తప్పించుకోవడం కోసమే ఈ పిటిషన్ వేసినట్లు కనిపిస్తోందని, వారికి ఉపశమనం కల్పించేందుకు నిర్దిష్ట కారణాలు కనిపించడం లేదని పేర్కొంటూ.. జస్టిస్ కుల్దీప్ తివారీ ధర్మాసనం వారి పిటిషన్‌ని కొట్టివేసింది.


Tags

Read MoreRead Less
Next Story