Rajnath Singh:రఫేల్ ఫైటర్ జెట్‌లో 50 శాతం దేశీయ తయారీ పరికరాలు..

సైనిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవడం కోసం భారత్ మరో డీల్‌కు సిద్ధమైంది. త్రివిధ దళాల పోరాట సామర్థ్యాన్ని పెంచే దిశగా ఫ్రాన్స్ తో రఫేల్ యుద్ధ విమానాల డీల్‌ను కుదుర్చుకోనుంది. ఇందుకోసం భారత్, ఫ్రాన్స్ రక్షణమంత్రుల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్‌లో పరికరాల తయారీకే రాజ్‌నాథ్ సింగ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
రఫేల్ ఫైటర్ జెట్‌లలో 50 శాతం దేశీయ తయారీ పరికరాలు ఉండేలా చూడాలని ఫ్రాన్స్‌ను కోరారు. ఆ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో కో డిజైన్, కో డెవలప్‌మెంట్, కో ప్రొడక్షన్ వంటి అంశాలు చేర్చినట్లు తెలుస్తోంది. రూ.3.25 లక్షల కోట్ల అంచనాతో 114 రఫేల్ యుద్ధవిమానాల సరఫరాకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో రక్షణ మంత్రుల స్థాయి వార్షిక సమావేశం జరిగింది.
భారత్‌లో తయారీ గురించి రాజ్‌నాథ్ సింగ్ చర్చించారు. ఈ డీల్‌లో ఎక్కువగా మేక్ ఇన్ ఇండియా పరికరాలు ఉండాలని, భారతీయ కంపెనీలకు సాంకేతికత బదిలీ వంటి అంశాలపై మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తదుపరి తరం ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీ విషయంలో సాంకేతిక సహకారం కోసం చర్చించినట్లు వెల్లడించాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
