Pragya Thakur: మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రగ్యా ఠాకూర్‌కు బెయిలబుల్ వారెంట్
మాలేగావ్ పేలుళ్ల కేసు-2008 లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత ప్రగ్యా సింగ్ ఠాకూర్కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మంగళవారంనాడు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. కేసు విచారణకు హాజరుకానందుకు ఈ వారెట్లు జారీ అయ్యారు. కేసు తుది వాదనలు మొదలైనందున నిందితులు హాజరుకావడం తప్పనిసరి. ఠాకూర్‌పై రూ.10,000 బెయిలబుల్ వారెంట్‌ను ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లహోతి జారీ చేశారు. నవంబర్ 13న తదుపరి విచారణకు హాజయ్యేంత వరకూ ఈ వారెంట్ అమలులో ఉంటుంది. కోర్టు ముందు ప్రగ్య ఠాకూర్ హాజరయితే వెంటనే వారెంట్ రద్దవుతుంది.
ప్రగ్యా ఠాకూర్ చికిత్స తీసుకుంటున్నారని, కాబట్టి ఈ కేసులో రోజువారీ విచారణకు ఆమె హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలంటూ ఆమె తరపు లాయర్లు పెట్టుకున్న పిటిషన్‌ను ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లహోటీ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో తుది విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిందితురాలు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని, కాబట్టి బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని జడ్జ్ ఆదేశించారు. కాగా, ప్రగ్యాపై వారెంట్లు జారీ కావడం ఇదే తొలిసారి కాదు. కాగా, 29 సెప్టెంబర్ 2008లో మహారాష్ట్రలోని మాలెగావ్‌లో ఓ మసీదు సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 100 మందికిపైగా గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com