AICC Elections : కాంగ్రెస్ అధ్యక్ష రేసులో మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్.. పోటీ నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్..

AICC Elections : సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖేర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికోసం సీనియర్ నేత శశిథరూర్ కూడా నామినేషన్ వేశారు. అయితేనామినేషన్ పత్రాలు కూడా తీసుకున్నదిగ్విజయ్‌సింగ్ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు.
గాంధీ కుటుంబం విధేయుడు ఖర్గేను బరిలోకి దింపాలని అధిష్ఠానం నిర్ణయించడంతో మల్లిఖార్జున ఖర్గే ఆఖరి నిమిషంలో అధ్యక్ష పదవికి పోటీలో నిలిచారు.మల్లికార్జున్ ఖర్గేకు దిగ్విజయ్‌సింగ్ మద్దతు తెలిపారు.ఈ నేపధ్యంలో మల్లికార్జున్ ఖర్గేతో దిగ్విజయ్‌సింగ్ సమావేశం అయ్యారు ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. పోటీ అనివార్యం అయితే అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి,19న ఫలితాలు విడుదల కానున్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com