WEST BENGAL: ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు... ఎక్కడో తెలుసా

పశ్చిమ బంగాల్ లో ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి. శాసనసభ్యుల వేతనాలను నెలకు 40వేలు పెంచినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు బంగాల్ శాసనసభలో ఓ ప్రకటన చేశారు. అయితే ముఖ్యమంత్రి జీతంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. చాలాకాలం నుంచి ఆమె జీతం తీసుకోవటం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే....పశ్చిమ బంగాల్ ఎమ్మెల్యేల జీతాలు తక్కువగా ఉన్నట్లు చెప్పారు. అందువల్ల ఎమ్మెల్యేల జీతాలు 40వేలు పెంచినట్లు మమతా బెనర్జీ తెలిపారు. తాజా పెంపు నిర్ణయంతో బెంగాల్ ఎమ్మెల్యేల జీతాలు ప్రస్తుతం ఉన్న 10 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయలకు పెరగనున్నాయి. మంత్రుల జీతాలు 10 వేల 900 నుంచి 50 వేల 900కి పెరగనున్నాయి. కేబినెట్ మంత్రుల జీతాలు 11 వేల నుంచి 51 వేలకు పెరగనున్నాయి. అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు దీనికి అదనం. అవి కలుపుకొంటే ఎమ్మెల్యేలకు ఇకపై లక్షా 21 వేలు, మంత్రులకు లక్షా 50 వేల రూపాయల చొప్పున లభిస్తాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా డీఏ చెల్లింపులు చేయాలంటూ ఓ వైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి, గవర్నర్ సీవీ ఆనంద బోస్‌కు మధ్య వివాదాలు పతాకస్థాయికి చేరాయి. ప్రతి ఏటా బెంగాల్ ప్రజలు.. నూతన సంవత్సర వేడుకలు జరుపుకొనే ‘పొయిలా బైశాఖ్’ రోజున ఇక నుంచి రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. 167 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయడంతో తీర్మానం ఆమోదం పొందింది. భాజపా సభ్యులు మాత్రం వ్యతిరేకించారు. ఈ తీర్మానం శాసనసభ ఆమోదించినా.. గవర్నర్ అంగీకరించరని.. భాజపా పక్ష నేత సువేందు అధికారి పేర్కొన్నారు. దీన్ని మమతా బెనర్జీ తోసిపుచ్చారు. గవర్నర్ ఆమోదం లేకున్నా ఆ రోజునే రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం జరుపుకొంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యానికి నిరసనగా రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తానని మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. రాజ్‌భవన్ బయటెందుకు.. అవసరమైతే లోపలే చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్ కొత్త సంవత్సరాన్ని పొలై బైసాకీ రోజునే సెలబ్రేట్ చేసుకునేందుకు తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే రాష్ట్ర గవర్నర్ ఈ తీర్మానానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ, గవర్నర్ ఆమోదించినా, ఆమోదించకపోయినా.. బెంగాలీ కొత్త సంవత్సరాన్ని జూన్ 20వ తేదీన జరుపుకోనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com