Mamata Banerjee : ఆర్ఎస్ఎస్‌ను పొగిడిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..

Mamata Banerjee : ఆర్ఎస్ఎస్‌ను పొగిడిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..
X
Mamata Banerjee : ఆరెస్సెస్ లోనూ మంచి వారు ఉన్నారంటూ... బెంగాల్ సీఎం మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి

Mamata Banerjee : ఆరెస్సెస్ లోనూ మంచి వారు ఉన్నారంటూ... బెంగాల్ సీఎం మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యతో మమత సెక్యూలరిజం తేటతెల్లమైందంటూ కాంగ్రెస్‌, సీపీఎం, మజ్లిస్‌ నేతలు విరుచుకుపడ్డారు. 2003లో కూడా మమత ఆరెస్సె్‌సను పొగిడారంటూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్‌ నేతలు కూడా ఆమెను దుర్గామాతతో పోల్చారన్నారు. ఆమె నిజాయితీ, స్థిరత్వంపై టీఎంసీలోని ముస్లిం నేతలు పొగుడుతూనే ఉంటారని ఆశిస్తున్నాననంటూ ఎద్దేవా చేశారు ఓవైసీ.

మరోవైపు కాంగ్రెస్ సైతం... మమత వ్యాఖ్యల్ని తప్పుబట్టింది. వాజ్‌పేయి హయాంలో మమత ఎన్డీయే కూటమిలో కొనసాగారని. ఓట్ల కోసం ఆమె కొన్నిసార్లు హిందూ.. మరికొన్ని సార్లు ముస్లిం అజెండాను ఎత్తుకుంటారంటూ విమర్శించారు కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి . మమత తాజా వ్యాఖ్యలతో ఆమె సెక్యూలరిజం బయటపడిందన్నారు. బీజేపీకి వ్యతిరేక పోరులో ఆమె నమ్మదగ్గ వ్యక్తి కాదనే విషయం తేటతెల్లమైందన్నారు సీపీఎం నేత సుజన్‌ చక్రవర్తి .

మరోవైపు ఈ విమర్శలను టీఎంసీ ఎంపీ సౌగతరాయ్‌ ఖండించారు. ఓ వైసీకి మా పార్టీ వైఖరిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ ఫైర్ అయ్యారు. మమత వ్యాఖ్యల్లో ప్రతి సంఘంలో మంచి-చెడూ ఉంటాయనే ఉద్దేశం ఉండి ఉంటుందన్నారు.

Tags

Next Story