Mamatha Benerjee : మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు అరెస్ట్..

Mamatha Benerjee : మమతాబెనర్జీ ముఖ్య అనుచరుల్లో మరో లీడర్ అరెస్ట్ అవడం బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆవుల అక్రమ రవాణా వ్యవహారంలో 2020లో నమోదైన కేసుకు సంబంధించి అనుబ్రత మోండల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పటికే 10 సార్లు నోటీసిచ్చినా విచారణకు సహకరించడం లేదంటూ అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసంలోనే సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు.
బీర్భూమ్ జిల్లా టీఎంసీ అధ్యక్షుడిగా ఉన్న అనుబ్రత మోండల్.. ఒక్కసారి కూడా ఎలక్షన్లలో పోటీ చేయలేదు. కానీ.. పార్టీలో చాలా కీలక వ్యక్తిగా ఎదిగారు. ఇవాళ మోండల్ అరెస్టును ప్రతిఘటిస్తూ టీఎంసీ కార్యకర్తలు ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో భారీ భద్రత మధ్య అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇప్పటికే మాజీ మంత్రి పార్థా చటర్జీ అరెస్టుతో కలకలం రేగింది. ఇప్పుడు మరో కీలక నేత కూడా జైలుకు వెళ్లడంతో.. TMCలో నెక్స్ట్ వికెట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com