Kerala : జడ్జి ముందు ప్రియుడికి షాక్ ఇచ్చిన ప్రియురాలు

Kerala : జడ్జి ముందు ప్రియుడికి షాక్ ఇచ్చిన ప్రియురాలు
సోదర భావం తప్ప రొమాంటిక్ ఫీలింగ్స్ లేవన్న అమ్మాయి... ఆత్మహత్యాయత్నం చేసిన అబ్బాయి

ఎవరో ఏదో అంటారని లవర్ ని ధైర్యంగా బయటకు చెప్పలేని వాళ్ళు చాలామందే ఉంటారు.. కానీ కేరళ కోర్టు లో జరిగిన సంఘటన లవర్ ను బాధపెట్టడమే కాదు జడ్జి ని కూడా ఆశ్చర్య పోయేలా చేసింది. వాడు నాకొక అన్న లాంటివాడు. వాడి మీద ఎలాంటి రొమాంటిక్‌ ఫీలింగ్స్‌ లేవు. కానీ సహజీవనం చెయ్యకపోతే చచ్చిపోతాడేమోనని అతనితో ఇంతకాలం కలిసి ఉన్నా అంటూ కోర్టులో ఓ యువతి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆ ప్రియుడికి దిమ్మతిరిగిపోయింది. వెంటనే ఆవేశంతో జడ్జి ఛాంబర్‌లోకి వెళ్లి కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన సోమవారం కేరళ హైకోర్టులో జరిగింది.

త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన విష్ణు నెల రోజులుగా ఒక 23 ఏళ్ల యువతితో ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. తమ ప్రేమకు పేరెంట్స్‌ ఒప్పుకపోవడంతో తాను ఇంటి నుంచి వచ్చేశానని ఆమె అతనితో చెప్పిందట. అయితే తన కూతురు కనిపించకుండా పోయిందంటూ ఆమె తండ్రి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తన కూతురిని అక్రమంగా విష్ణు బంధించాడని పిటిషన్‌లో ఆరోపించాడాయన. సోమవారం ఆ జంటను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అప్పటిదాకా విష్ణు లేనిదే తాను ఉండలేనంటూ పోలీసులతో, మీడియా ముందు గోల గోల చేసిన ఆ యువతి.. జడ్జి ముందు మాట మార్చింది.


తన పేరెంట్స్‌ తనకు ఏంతో ముఖ్యమని, తాను కుటుంబంతోనే వెళ్లిపోతానని అయినా విష్ణు మీద ఒక అన్నలా ఆప్యాయత ఉందేతప్ప మరేయితర ఫీలింగ్‌ లేదని, అతను బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. దీంతో డివిజన్‌ బెంచ్‌ యువతిని తన ఇష్టప్రకారంగా వెళ్లిపోవచ్చని సూచిస్తూ.. విష్ణుని మందలించింది. ఊహించని పరిణామంతో బోరున విలపిస్తూ బయటకు వెళ్లిపోయిన విష్ణు.. ఓ కత్తితో జస్టిస్‌ అను శివరామన్‌ ఛాంబర్‌కు వెళ్లాడు. ఆవేశంతో తన మణికట్టు కోసుకున్నాడు. న్యాయమూర్తి అప్రమత్తం చేయడంతో పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు.

అన్నట్టు విష్ణుకు అప్పటికే వివాహం కాగా ఈ యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని తెలిశాక భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story