Gujarat : భర్తను వదిలేసి మహిళతో పారిపోయిన 7 నెలల గర్భవతి

గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోయిన భార్యను వెతికి పెట్టాలంటూ ఒక వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. స్వలింగ సంపర్కురాలైన తన భార్య అక్టోబర్‌లో తన ప్రియురాలితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయిందని, ఆ సమయానికి ఆమె ఏడునెలల గర్భవతి అని ఆయన కోర్టుకు విన్నవించాడు. దీనిపై చాంద్‌ఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వారు తన భార్య ఆచూకీని కనుగొనలేకపోయారని తెలిపాడు. కాగా, ఆమెను ఈ నెల 23లోగా తమ ముందు హాజరుపర్చాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
పెళ్లికి ముందు ప్రేమించుకున్న వారిని తల్లిదండ్రులు.. బెదిరించో, బతిమాలో ఆ ప్రేమాయణాన్ని అక్కడికి కట్ చేసి ఇంకొకరికి ఇచ్చి పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు. అయితే అందులో చాలా మంది ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని.. వారితో ఉండలేక.. తిరిగి ప్రేమించినవారితో కలిసి పారిపోయిన సంఘటనలు మనం నిత్యం ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం. దీంతో వారిద్దరి కుటుంబాలు రోడ్లపైకి వచ్చి తన్నుకోవడమో.. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయితే ఈ ఘటన మాత్రం అలాంటి వాటికి మరింత భిన్నం. ఎందుకంటే ఓ యువతి పెళ్లికి ముందే.. మరో యువతిని ప్రేమించింది. అది తెలిసి తల్లిదండ్రులు ఆగమేఘాల మీద ఓ వ్యక్తిని చూసి పెళ్లి చేసేశారు. కొద్దిరోజులు బాగానే ఉండగా.. ఆమె గర్భవతి కూడా అయింది. అంతా చక్కబడుతుంది అనే సమయంలో ఆమె పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. పెళ్లికి ముందు ప్రియురాలితో కలిసి 7 నెలల గర్భిణీ పరారైంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఆ లెస్బియన్ ప్రేమ కథ ఇప్పుడు తెగ సంచలనంగా మారింది. ఒక యువతి మరో యువతిని ప్రేమించింది. ఈ విషయం కాస్తా ఆ యువతి ఇంట్లో తెలిసింది. అది విని వారు మొదట షాక్ అయ్యారు. నలుగురికీ తెలిస్తే తమ పరువు పోతుందని భావించి.. ఎలాగైనా వారి ప్రేమను విడదీయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తిని చూసి తమ కుమార్తెను ఇచ్చి 2022 అక్టోబరులో పెళ్లి చేశారు. ఆ తర్వాత అంతా సక్రమంగానే సాగింది. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అని తెలిసింది. అయితే ఆమె డెలివరీ తేదీ వచ్చే ఏడాది ఫిబ్రవరి అని డాక్టర్లు చెప్పారు. దీంతో అంతా బాగానే ఉందని మహిళ తల్లిదండ్రులు భావిస్తుండగానే ఆమె అందరికీ షాక్ ఇచ్చి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
సరిగ్గా ఏడాది పాటు భర్తతో ఉన్న ఆ మహిళ.. ఈ అక్టోబర్ నెలలో తన లెస్బియన్ ప్రేయసితో పరారైంది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఛాంద్‌ఖేడా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చాడు. విచారణ జరిపిన పోలీసులు.. ఆమె ఒక లెస్బియన్ అని.. తన ప్రియురాలితో పారిపోయిందని గుర్తించారు. ఆ విషయం తెలుసుకుని ఆ భర్తకు మైండ్ బ్లాంక్ అయింది. పెళ్లికి ముందే వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని తెలిసి అవాక్కయ్యాడు. ప్రస్తుతం ఆమె 7 నెలల గర్భవతి కాగా.. మరో రెండు నెలల్లో ఆమెకు డెలివరీ కావాల్సి ఉండగా.. ఎక్కడ ఉందోనని ఆ భర్త తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com