నీట్ లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థి ఆత్మహత్య.. కొడుకు మరణంతో తండ్రి కూడా..

నీట్ లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థి ఆత్మహత్య.. కొడుకు మరణంతో తండ్రి కూడా..
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షను రెండుసార్లు అటెంప్ట్ చేశాడు..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షను రెండుసార్లు అటెంప్ట్ చేశాడు.. అయినా ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. దాంతో నిరాశ చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తమిళనాడుకు చెందిన ఎస్ జెగదీశ్వరన్ (19) రెండుసార్లు నీట్ పరీక్ష రాశాడు. సీటు రాకపోవంతో మనస్థాపానికి గురయ్యాడు.. దాంతొ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని కళ్లారా చూసి తట్టుకోలేకపోయిన తండ్రి సెల్వశేఖర్‌ తానూ ఉరివేసుకుని తనువు చాలించాడు. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు కొడుకు తన నివాసంలో ఉరివేసుకుని ఉండటం చూసి షాక్ అయ్యాడు. "అతను రెండుసార్లు నీట్ పరీక్షలో ఫెయిలయ్యాక, మళ్లీ రాయమని ప్రోత్సహించాము. అంతేకాని అతడిని దూషించలేదు.. అయినా అవమానంగా భావించాడు.. ప్రాణాలు బలితీసుకున్నాడు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తన మ్యానిఫెస్టోలో పిల్లల ప్రాణాలను కాపాడుతానని, నీట్ పరీక్షను రద్దు చేస్తానని చెప్పారు. కానీ దానిని ఆచరణలో పెట్టలేదు. దాంతో విద్యార్థులు బలవుతున్నారు. నేను సింగిల్ పేరెంట్‌ని ఎవరూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదు, సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని సెల్వశేఖర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.

కొడుకు మృతి చెందాడన్న బాధను తట్టుకోలేక సెల్వశేఖర్ కూడా సోమవారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story