Karnataka : దర్జాగా ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నాడు..కానీ

కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అందరూ హడావిడిగా ఉన్నారు. 72 ఏళ్ల వృద్ధుడొకరు దర్జాగా అసెంబ్లీలోకి వెళ్లి కూర్చున్నాడు. 15 నిమిషాలు ఓ ఎమ్మెల్యేలా ఫోజ్ ఇచ్చాడు. అంత ధీమగా ఉండేటప్పటికీ కనీసం ఎవరికి అనుమానం కూడా రాలేదు. తరువాత ఓ ఎమ్మెల్యే గుర్తించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో పార్టీకి సంబంధం లేని వారు కూడా వచ్చి కూర్చుంటారు. అదేం పెద్ద విషయం కాదు. కానీ అలా ఒక బయటపెట్టి అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే షాక్ అవ్వాల్సిందే కదా.. అసలు అసెంబ్లీ భద్రతను అనుమానించాల్సిందే కదా..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడంతో సీఎం సిద్ధరామయ్య శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అందరూ బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అసెంబ్లీకి వస్తున్నారు. ఇంతలో ఓ ముసలాయన డైరెక్ట్ గా వచ్చి అసెంబ్లీలోని దేవదుర్గ ఎమ్మెల్యే కరెమ్మ సీటులో కూర్చున్నాడు. 15 నిమిషాల వరకు ఎవరు అతనిని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత అతడిని చూసి జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కు అనుమానం వచ్చింది. పక్కనున్న ఇతర ఎమ్మెల్యేలను అడిగారు. ముసలతను ఎమ్మెల్యే కాదన్న విషయం కచ్చితంగా తెలిసిపోవడంతో స్పీకర్ కు, మార్షల్స్ కు సమాచారం అందించారు. మార్షల్స్ వచ్చి నిందితుడిని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఈ సారి తాను సాగర్ ఎమ్మెల్యే బేలూర్ గోపాలకృష్ణ అని, బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని మొండిపట్టు పట్టాడు. గోపాలకృష్ణ చాలా సీనియర్ ఎమ్మెల్యే అందరికీ తెలిసిన వ్యక్తి సో ఆ ప్రయత్నము ఫలించలేదు. తరువాత తాను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అని ఇంకేదో చెప్పాబోయాడు. ఎమ్మెల్యే అని రుజువు చేసే ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడిని చిత్రదుర్గకు చెందిన తిప్పేరుద్రప్ప గుర్తించారు. ఘటన జరిగిన రెండు గంటల తర్వాత అధికారులు విచారణ చేపట్టారు. సంఘటన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 14వ సారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com