ముంబై రెస్టారెంట్ బాగోతం.. చికెన్ కర్రీలో ఎలుక మాంసం..

ముంబై రెస్టారెంట్‌లో చికెన్ కర్రీలో ఎలుక మాంసాన్ని గుర్తించిన వ్యక్తి, రెస్టారెంట్ మేనేజర్ పైన, వంట మనిషిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై బాంద్రా ప్రాంతంలోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో వడ్డించిన చికెన్ కర్రీలో ఒక కస్టమర్ ఎలుక మాంసం ముక్కను కనుగొన్నాడు. ఈ కేసుకు సంబంధించి రెస్టారెంట్ మేనేజర్, వంట మనిషిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారు అనురాగ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, అతను తన స్నేహితుడితో కలిసి భోజనం చేసేందుకు పాలీ హిల్, బాంద్రా వెస్ట్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. వారు బ్రెడ్‌తో చికెన్ మరియు మటన్ థాలీ (ప్లాటర్) ఆర్డర్ చేశారు. భోజనం చేస్తున్నప్పుడు, వారు భిన్నంగా కనిపించిన మాంసం ముక్కను గమనించారు. నిశితంగా పరిశీలించగా అది ఎలుక మాంసం ముక్క అని తెలుసుకున్నారు. దాంతో వారికి వాంతి వచ్చినంత పనైంది. వెంటనే వారు రెస్టారెంట్ మేనేజర్‌ని కలిసి విషయాన్ని వివరించారు. అయినా అతను తప్పు ఒప్పుకోకుండా బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో అనురాగ్ సింగ్ బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా రెస్టారెంట్ మేనేజర్ వివియన్ ఆల్బర్ట్ షికావర్, ఆ సమయంలో ఉన్న హోటల్‌లోని చెఫ్, చికెన్ సప్లయర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com