Reel stunt : ఫ్లైవోవర్ మీద కారు ఆపి రీల్స్..

నార్త్ ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ సమీపంలో ఫ్లైఓవర్‌పై ఓ వ్యక్తి ఓవర్ ఆక్ష్సన్ చేశాడు. దానికి స్పందించిన పోలీసులు అతనికి భారీ జరిమానా విధించి కారును సీజ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. నగరంలో రద్దీగా ఉండే ఫ్లై ఓవర్‌పై కారును ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు. దీంతో ఢిల్లీ పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.36,000 జరిమానా విధించారు. నిందితుడి పేరు ప్రదీప్ ఢాకా అని, పోలీసులపై దాడికి కూడా ప్రయత్నించాడని పోలీసులు వివరించారు.
నిందితుడు ప్రదీప్ కారును సీజ్ చేసి అతడిపై మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీ సమయంలో ఢిల్లీలోని పశ్చిమ్ విహార్‌లోని ఫ్లైఓవర్‌పై కారును ఆపి వీడియోలు చిత్రీకరించి, డోర్ తెరిచి కారును నడిపినట్లు పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా పోలీసుల బారికేడ్లకు నిప్పంటించి వీడియోలు తీశాడని వివరించారు. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్‌పై కేసు నమోదు చేయడానికి దారితీసిన వీడియోలను ఢిల్లీ పోలీసులు పంచుకున్నారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అతడిని అరెస్టు చేసినట్లు వివరించారు. ప్రదీప్ ఉపయోగించిన కారు అతని తల్లి పేరు మీద రిజిస్టర్ అయిందని, ఆ కారులో కొన్ని నకిలీ ప్లాస్టిక్ ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.
పైగా వాళ్లేదో ఘనకార్యం వెలగబెట్టినట్లు దీన్నంతా షూట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారులో ప్లాస్టిక్‌తో తయారు చేసిన కొన్ని నకిలీ ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి. కారు ప్రదీప్ తల్లి పేరు మీద రిజిస్టరై ఉన్నట్లు గుర్తించారు. గతంలోనూ ప్రదీప్ పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com