Bengaluru Murder: హోట‌ల్ గ‌దిలో గ‌ర్ల్‌ఫ్రెండ్‌ హ‌త్య, రోజంతా శవంతోనే నిందితుడు

Bengaluru Murder: హోట‌ల్ గ‌దిలో గ‌ర్ల్‌ఫ్రెండ్‌  హ‌త్య,  రోజంతా శవంతోనే నిందితుడు
X
బెంగళూర్‌లో ఘటన..

19 ఏళ్ల అస్సాం అమ్మాయి మాయా గ‌గోయ్‌.. బెంగుళూరులోని స‌ర్వీస్ అపార్ట్‌మెంట్‌లో హ‌త్య‌కు గురైంది. ప్రియురాలని కత్తితో పొడిచి ఓ వ్యక్తి హత్య చేశారు. ఇద్దరూ కూడా శనివారం నగరంలోని సర్వీస్ అపార్ట్‌మెంట్ లాబీలోకి ప్రవేశించేటప్పుడు నవ్వుతూ కనిపించారు. మూడు రోజుల తర్వాత అదే అపార్ట్‌మెంట్‌లో యువతి మృతదేహంగా కనిపించింది. వివరాల్లోకి వెళ్లే అస్సాంకు చెందిన యువతి మాయా గొగోయ్‌ని ప్రియుడు ఆరవ్ హర్ని హత్య చేశాడు. బుక్ చేసుకున్న సర్వీస్ అపార్ట్‌మెంట్లో మాయా మృతదేహం లభ్యమైంది.

పోలీసులు వివరాల ప్రకారం.. హర్ని సోమవారం గొగోయ్‌ని కత్తితో పొడిచి చంపాడు. మంగళవారం ఇందిరానగర్ ప్రాంతలోని అద్దె అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వెళ్లే ముందు వరకు రోజంతా మృతదేహంతోనే ఉన్నాడు. గదిలో దుప్పటి, దిండుపై రక్తపు మరకలు ఉన్నాయి. మూడురోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితిలో మాయా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అద్దె అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులు డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మాయా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లోని ఒక రెండెడ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. నిందితుడు ఆరవ్ హర్ని మృతదేహంతో ఒక రోజు పాటు గడిపాడు. అయితే, మృతదేహాన్ని ముక్కలు చేసి వేరే చోట పడేయాలనే ప్లాన్ చేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అలాగే అనుమానిత వ్య‌క్తి కేర‌ళ‌కు చెందిన‌ట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్ నుంచి వెళ్లిన త‌ర్వాత అత‌ను త‌న మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేశాడు. న‌వంబ‌ర్ 23 నుంచి 26 వ‌ర‌కు స‌ర్వీసు అపార్ట్‌మెంట్‌లోకి ఎవ‌రూ వెళ్లిన‌ట్లు ఆధారాలు లేవు. త‌న‌తో పాటు క‌త్తి తెచ్చుకున్న నిందితుడు.. రూమ్‌కు వ‌చ్చాక నైలాన్ రోప్‌ను ఆర్డ‌ర్ చేశాడు. చెడు వాస‌న వ‌స్తున్న‌ట్లు పోలీసుల‌కు ఫోన్ కాల్ వ‌చ్చిన త‌ర్వాత ఆ రూమ్‌కు పోలీసులు వెళ్లారు. డాగ్ స్క్వాడ్‌, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో ఉన్న ఓ ప్రైవేటు సంస్థ‌లో మాయా గ‌గోయ్ కౌన్సిల‌ర్‌గా చేస్తోంది. పోలీసులు మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు చేశారు. మాయా గ‌గోయ్ సోద‌రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనుమానితుల కోసం గాలిస్తున్నారు.

Tags

Next Story