Youtube treatment : కడుపులో బాలేదని కర్పూరం మింగాడు.. చివరికి

Youtube treatment : కడుపులో బాలేదని కర్పూరం మింగాడు.. చివరికి
వికటించిన యూట్యూబ్ వైద్యం.. ఆసుపత్రి పాలు

ఒక్కోసారి కొందరు చేస్తున్న పనులు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఏదైనా అనుమానం వస్తే చాలు గూగుల్, యూట్యూబ్ పై ఆధారపడిపోతున్నారు. అందులో వీడియోలు చూసి తమ సందేహాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతవరకూ అయితే పర్లేదు కొందరైతే మరీ శ్రుతి మించి యూట్యూబ్ వీడియోలు చూసి సొంతం వైద్యం చేసుకుంటున్నారు. అయితే, ఇది చాలా సందర్భాల్లో వికటిస్తోంది. యూట్యూబ్ లో చూసి సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి. డయేరియాతో బాధపడుతున్న అతడు యూట్యూబ్ వీడియోలు చూసి ఏకంగా 10 కర్పూరం బిళ్లలు మింగేశాడు. అంతే ఆ వైద్యం వికటించి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యాడు.

జార్ఖండ్ రాష్ట్రంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. లాతేహార్ జిల్లా బలుమత్ మండలంలోని టోటీ హెస్లా గ్రామానికి చెందిన అవదేశ్ డయేరియా బారినపడ్డాడు. హాస్పిటల్ కి వెళితే చాలా ఖర్చు అవుతుందని భావించాడు. మరో మార్గం ఎంచుకున్నాడు. యూట్యూబ్​ చూసి సొంత వైద్యం చేసుకున్నాడు. విరేచనాలు తగ్గేందుకు యూట్యూబ్​లో సూచించిన విధంగా 10 కర్పూరం బిళ్లలు మింగాడు. ఆ తర్వాత వైద్యం వికటించి ఆరోగ్యం విషమించింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


బలుమత్ మండలంలోని టోటీ హెస్లా గ్రామంలో నివసిస్తోన్న అవధేశ్​ కుమార్ సాహుకు డయేరియా వచ్చింది. యూట్యూబ్​లో ఇంటి చిట్కాల ప్రకారం 10 కర్పూరం మాత్రలను మింగాడు. అయితే ఉపశమనం పొందటానికి బదులుగా, అతడి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారంది. అవధేశ్​ పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడం చూసి.. కుటుంబ సభ్యులు అసలు ఏం జరిగిందని ఆరా తీయగా అవధేశ్​ తాను విరేచనాలు తగ్గడానికి కర్పూరం మాత్రలు మింగినట్లు చెప్పాడు.

దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ బాధితుడికి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. అతని శరీరంలో కర్పూరం ప్రభావం ఇంకా ఉందని, అందుకే కనీసం రెండు మూడు రోజులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపారు. అనారోగ్యానికి గురైనపుడు యూట్యూబ్​ బదులుగా వైద్యుల వద్ద చికిత్స పొందడం మంచిదని చెబుతున్నారు. వారు ఇచ్చిన గుర్తింపు ఉన్న మందులు వాడటం ఉత్తమమని సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story