Kangana Ranaut: కంగనాకు హైకోర్టు నోటీసులు

Kangana Ranaut: కంగనాకు హైకోర్టు నోటీసులు
X
కంగనా రనౌత్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్

హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు బుధవారం.. మండి బీజేపీ లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌ కు నోటీసులు జారీ చేసింది. ఆమె ఎన్నికను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత కోర్టు కంగనా రనౌత్‌కి నోటీసు పంపింది. నోటీసు జారీ చేస్తూ, జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ ఆగస్టు 21 లోగా కంగనా రనౌత్ నుండి సమాధానం కోరింది. కిన్నౌర్ నివాసి, స్వతంత్ర అభ్యర్థి లైక్ రామ్ నేగి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ తన నామినేషన్ తిరస్కరించబడిందని లైక్ రామ్ నేగి ఈ పిటిషన్ ద్వారా వాదించారు. కంగనాను అనర్హురాలిపై ప్రకటించాలని లాయక్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి (డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మండి)ని దూషిస్తూనే.. ఈ కేసులో అతన్ని బాధ్యుడిని చేయాలనే డిమాండ్ వచ్చింది. లైర్ రామ్ నేగి అటవీ శాఖ మాజీ ఉద్యోగి. అతను అకాల పదవీ విరమణ తీసుకున్నాడు. ఈయన గతంలో అటవీ శాఖలో పని చేసేశారు. పదవీ విరమణ తరువాత రిటర్నింగ్ అధికారి(మండి డిప్యూటీ కమిషనర్)కి నామినేషన్ పత్రాలతోపాటు డిపార్ట్‌మెంట్ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ కూడా సమర్పించినట్లు చెప్పారు. విద్యుత్‌, నీరు, టెలిఫోన్‌ శాఖల నుంచి ‘నో డ్యూ సర్టిఫికేట్‌’ సమర్పించేందుకు ఒక రోజు గడువు ఇవ్వగా, రిటర్నింగ్‌ అధికారి వాటిని ఆమోదించలేదని.. పైగా నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారన్నారు. తన నామినేషన్‌ని స్వీకరించి ఉంటే విజయం సాధించేవాడినని, వివరాలను అన్ని సమర్పించినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల తేడాతో కంగనా విజయం సాధించారు. సింగ్‌కు 4,62,267 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కంగనాకు 5,37,002 ఓట్లు వచ్చాయి. రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ పత్రాలను అక్రమంగా తిరస్కరించారని లాయక్ ఆరోపించారు.

Tags

Next Story