అట్టుడుకుతోన్న మణిపూర్

మణిపూర్ లో ఘర్షణలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. నెల రోజుల తరువాత కూడా రాష్ట్రం భగ్గుమాంటూనే ఉంది.
తాజాగా ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని చింగరేల్‌లో మణిపూర్ మంత్రి ఎల్ సుసింద్రో ప్రైవేట్ గోడౌన్‌కు కొందరు నిప్పంటించారు. అలాగే జిల్లాలోని ఖురై ప్రాంతంలో మణిపూర్ ఆహార శాఖ మంత్రి నివాసానికి కొందరు నిప్పంటించే ప్రయత్నం చేశారు. అయితే సకాలంలో పోలీసులు స్పందించడంతో ఆందోళన కారులు చేదిరిపోయారు.
మణిపూర్‌లో అల్లర్లు, అలజడి ఆగలేదు సరికదా పెరుగుతూనే ఉన్నాయి. మణిపూర్ లో జరిగిన హింసాత్మక సంఘటనల కారణంగా నిర్వాసితులైన ప్రజల గృహాల ఏర్పాటు కోసం మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్థలాలను పరిశీలించిన కొన్ని గంటల తేడాలోనే ఓ మంత్రి ఇంటిపై దాడి జరిగింది. శుక్రవారం రాత్రి ఆందోళనకారులు మంత్రి ఎల్ సుసింద్రో ప్రైవేట్ గోడౌన్‌కు నిప్పంటించారు. ఇది పూర్తిగా దగ్ధమైనట్టుగా పోలీసులు తెలిపారు. ఆహార శాఖ మంత్రి నివాసానికి నిప్పు పెట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. అయితే సకాలంలో పోలీసులు వీరిని అడ్డగించడంతో ఆందోళనకారుల ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనల్లో ఎవరికి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలతో నిరాశ్రయులైన వారికి ఇండ్లను నిర్మించేందుకు అవసరమైన స్ధలాలను మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ పరిశీలించిన కొద్దిసేపటికే మంత్రి గోడౌన్, నివాసంపై దాడులు జరగడం విశేషం.
మణిపూర్‌లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకూ ఇప్పటివరకూ సుమారు 120 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది సహాయ శిబిరాల్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దసంఖ్యలో ఇండ్లు దగ్ధమయ్యాయి. తమకు ఎస్టీ హోదా కల్పించాలన్న మెయిటీ వర్గీయులు డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ మే 3న గిరిజన సంఘీభావ మార్చ్ జరిగినప్పటి నుంచి అల్లర్లు చెలరేగాయి.
మొట్టమొదట రాష్ట్ర మంత్రి నెంచ కిపెన్ అధికార నివాసానికి జూన్ 14 కొందరు నిప్పంటించారు. మరుసటి రోజు కేంద్ర మంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ నివాసంపై దాడిచేసిన దుండగలు ఆయన ఇంటిని దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. ఇలా రోజుకొకరు చెప్పున ఏదో ఒక మంత్రి ఇంటి పైకి దాడి చేస్తున్నారు దుండగులు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అటు మెయిటీ లు, ఇటు కుకీలు కూడా ప్రభుత్వ బలగాలు ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నాయన్న అభిప్రాయంలో ఉండటమే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com