Manipur clashes: మణిపుర్‌లో మళ్లీ ఘర్షణలు

Manipur clashes: మణిపుర్‌లో మళ్లీ ఘర్షణలు
X
ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంగోల్ గ్రామంలో చెలరేగిన హింస....15 ఇళ్లకు నిప్పు.. ఒక వ్యక్తికి బుల్లెట్‌ గాయాలు...

మణిపుర్‌‍( Manipur)లో జాతుల మధ్య చెలరేగిన మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. మూడు నెలల కింద మొదలైన ఉద్రిక్తతలు ఇంకా అంతం కావడం లేదు. ఇంఫాల్ పశ్చిమ జిల్లా(Imphal West district )లోని లాంగోల్ (Langol village )గ్రామంలో మళ్లీ ఘర్షణలు(Manipur clashes) చెలరేగాయి. పలు ఇళ్లకు ఆందోళనకారులు 15 ఇళ్లకు నిప్పు( 15 houses torched) పెట్టారు. ఇంఫాల్ వెస్ట్‌ సహా కాంగ్‌పోక్పి జిల్లాల్లోనూ పలు గ్రామాల్లహింసాత్మక ఘటనలు(Fresh violence) చోటుచేసుకున్నాయి. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈక్రమంలో జరిపిన కాల్పుల్లో 4(1 person shot)5ఏళ్ల వ్యక్తికి తూటా తగిలి గాయపడ్డాడు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చెకాన్‌లో ఒక వాణిజ్య నిర్మాణం సహా మూడు ఇళ్లకు నిరసనకారులు నిప్పంటించారు.


కాంగ్‌పోక్పి జిల్లాలో భద్రతా దళాలకు(Security personnel), తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి నుంచి 50 రౌండ్లతో కూడిన రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 27అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మణిపుర్‌లో ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి దించింది. 900 మంది భద్రతా దళాలను మణిపుర్‌కు తరలించింది. ఇప్పటికే రాజధాని ఇంఫాల్‌కు చేరుకున్న ఈ బృందాలను సమస్యాత్మక జిల్లాలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. మణిపుర్‌లో మే 3న మొదలైన అల్లర్లన అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ఇప్పటికే 40వేల మంది సైనికులను అక్కడ మోహరించింది.


దాదాపు మూడు నెలల క్రితం ఈశాన్య రాష్ట్రంలో జాతి హింస చెలరేగింది, అప్పటి నుండి 160 మందికి పైగా మరణించారు మరియు వందలాది మంది గాయపడ్డారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించిన తర్వాత హింస చెలరేగింది. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. వీరిలో ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. నాగాలు మరియు కుకీలు కలిగి ఉన్న గిరిజనులు 40 శాతం ఉన్నారు. వీరంతా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

Tags

Next Story