Manipur Violence : ఒక్కొక్కటిగా వెలుగులోకి దారుణాలు

Manipur Violence : ఒక్కొక్కటిగా వెలుగులోకి దారుణాలు
మణిపుర్‌లో ఇళ్లు, పాఠశాలకు నిప్పు... మహిళా సాయుధ గుంపు దారుణం.. తప్పిన పెను ప్రమాదం..

కొన్నిరోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్‌(Manipur unrest)లో దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మహిళల నగ్న ఊరేగింపు, ఇద్దరు మహిళలపై దారుణ అత్యాచారం, ఒక వ్యక్తి తల నరికి వేలాడ దీసిన దారుణాలు మరచిపోక ముందే మరో దారుణ ఘటన వెలుగులో చూసింది. ఇన్నాళ్లు ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఉండడంతో బయటకు రాని వీడియోలన్నీ ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. తాజాగా మహిళ సాయుధ తిరుగుబాటుదారులు( mob led by women) మణిపుర్‌లో ఇళ్లు, స్కూళ్ల(School set on fire)కు నిప్పు పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన తాజా(క్లాషెస్ Fresh violence)గా వెలుగులోకి వచ్చింది.


మణిపుర్‌( Manipur)లో పది ఇళ్లతో పాటు ఓ పాఠశాలకు కూడా మహిళా సాయుధ తిరుగుబాటుదారులు నిప్పుపెట్టారు. వందల మందితో కూడిన మహిళా సాయుధ తిరుగుబాటుదారులు పది ఇళ్లకు నిప్పుపెట్టారు. ఓ స్కూల్‌కు కూడా దగ్దం‍(school burnt) చేశారు. BSF వాహనాన్ని కూడా మహిళల గుంపు ఎత్తుకెళ్లింది. మరో బీఎస్ఎఫ్ వాహనాన్ని( Casper vehicle of the BSF) కూడా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా.. భద్రతా బలగాలు వారిని నిరోధించాయి. ఆ సమయంలో ఇళ్లు, పాఠశాలల్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదు.


చురాచాంద్‌పుర్ జిల్లా(Churachandpur)లోని టోర్బంగ్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనకు ముందు మహిళా సాయుధ తిరుగుబాటుదారులు.. గాల్లో చాలారౌండ్లు కాల్పులు కూడా జరిపారని స్థానికులు తెలిపారు. కొద్ది రోజులుగా జాతుల మధ్య ఘర్షణలతో మణిపుర్ అట్టుడుకుతోంది. మే 3(May 3)న రెండు వర్గాల మధ్య హింస(situation is still dire) చెలరేగింది. ఆ తర్వాతి రోజు జరిగిన అమానుష ఘటనకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తూ కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళలపైన లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు సైతం వచ్చాయి. అన్ని రాజకీయ పక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి.


కాగా మణిపుర్ ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికి పైగా పౌరులు(160 people have lost their lives) మృతిచెందారు. 50 వేల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మణిపుర్‌ ఘటనపై ప్రధానమంత్రి మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నాయి. విపక్ష ఇండియా ఫ్రంట్‌ నేతల ఆందోళనలతో సభ కార్యకలాపాలు ముందుకు సాగటం లేదు.

Tags

Read MoreRead Less
Next Story