MANIPUR: 126 చెక్‌పోస్ట్‌లు.. అణువణువు గాలింపు..

MANIPUR: 126 చెక్‌పోస్ట్‌లు.. అణువణువు గాలింపు..
మణిపూర్‌ నిందితుల కోసం అణువణువూ గాలింపు... 126 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి జల్లెడ పడుతున్న పోలీసులు

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన(paraded naked) ఘటనలో మనిషి రూపంలో ఉన్న మృగాల కోసం భారీ ఎత్తున వేట కొనసాగుతోంది. తీవ్ర విమర్శలకు దారితీసిన వీడియోలోని మిగతా వారిని వెతికే పనిలో( search on to arrest all culprits) పోలీసులు నిమగ్నమయ్యారు. జాతుల మధ్య వైరంతో విద్వేషం పెంచుకుని మూక దాడిలో ఇద్దరిని బలిగొనడమే కాకుండా.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకునేందుకు భారీగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.


మణిపుర్ లోయ, పర్వత ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో 126 చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి నిందితుల కోసం అణువణువూ గాలిస్తున్నారు.శాంతి భద్రతలకు మరోసారి విఘాతం కలిగే అవకాశాలు ఉండడంతో.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే(Manipur tense) నిందితులను త్వరగతిన పట్టుకునే ప్రయత్నం చేస్తామని మణిపూర్‌ పోలీస్‌ శాఖ ప్రకటించింది. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గాలింపు చర్యల్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు.అనుమానిత స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని, పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా, అస్థిరంగా ఉందని పేర్కొన్నారు.

అయితే ఎలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సరైన సమాచారం తెలుసుకునేలా.. హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. తాజాగా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ 413 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఓ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. వీడియో ఆధారంగా వీలైనంత మందిని ట్రేస్‌ చేసి.. వాళ్ల ద్వారా మిగతా వాళ్లను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. వీడియో వైరల్‌ కావడంతో వాళ్లంతా తలోదిక్కు పారిపోయి తలదాచుకుని ఉంటారని భావిస్తున్నారు.


మణిపూర్‌ వీడియోలు అంటూ సోషల్‌ మీడియాలో దిగ్భ్రాంతికర కంటెంట్‌ అవుతోంది. ఈ క్రమంలో పుకార్లకు చెక్‌పెట్టేందుకు..మణిపూర్‌ ప్రభుత్వం 9233522822 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయించింది . ఘర్షణల్లో ఎత్తుకెళ్లిన ఆయుధాలను దయచేసి దగ్గర్లో ఉన్న స్టేషన్‌లో అప్పగించాలంటూ విజ్ఞప్తి చేస్తోంది.

మణిపూర్‌ నుంచి దేశాన్ని కుదిపేసిన కీచకపర్వానికి సంబంధించి మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగు చూసింది. 2020లో దేశంలోనే ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా కేంద్రం నుంచి ప్రశంసలు అందుకున్న నోంగ్‌పోక్‌ సెక్మయ్‌ స్టేషన్‌ పరిధిలోనే ఈ అకృత్యం జరగిందని తేలింది. ఈ స్టేషన్‌ పరిధిలో ఉన్న బీ ఫైనోమ్ గ్రామంలో మహిళలను నగ్నంగా ఊరేగించారు. పక్షం తర్వాత బాధితులు ఫిర్యాదు చేయడంతో.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నోంగ్‌పోక్‌ సెక్మయ్‌ పోలీసులు.. అపహరణ, హత్య, గ్యాంగ్‌ రేప్‌ నేరాల కింద కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story