manipur violence: మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

manipur violence: మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు


మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందారు. తెల్లవారుజామున మరో ముగ్గురు టీనేజర్లు మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలు బిష్ణుపుర్‌ - చురాచాంద్‌పుర్‌ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. 24 గంటల వ్యవధిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు నెలలుగా బిష్ణుపుర్‌- చురాచాంద్‌పుర్‌ సరిహద్దులో హింస, హత్యలు, దహన సంఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి.

దీంతో ఈ సరిహద్దులోని కొన్ని గ్రామాలు సున్నిత ప్రాంతాలుగా మారాయి. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని‘బఫర్‌ జోన్‌’గా మార్చాయి. ఇళ్లపై కాల్పులు జరపకుండా బలగాలు ఆపగలిగాయి. అయితే కాంగ్వాయ్‌, సాంగ్‌డో, అవాంగ్‌ లేఖై గ్రామాల్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయని తెలిపారు సీనియర్‌ భద్రతా అధికారి.

Tags

Read MoreRead Less
Next Story