Mansukh Mandaviya: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.. మరోసారి సైకిల్‌పై..

Mansukh Mandaviya (tv5news.in)
Mansukh Mandaviya: మంత్రులంటే ఖరీదైన కార్లు.. ఆ కారు చుట్టు మరో నాలుగు కార్లు.. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ.. ఇవన్నీ ఉండాల్సిందే. ఏ రాజకీయ నాయకుడికైనా వారి రక్షణను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ అందిస్తుంది ప్రభుత్వం. కానీ ఈ సౌకర్యాలు అన్నింటిని కాదని చాలా సాదాసీదాగా బ్రతికే వారు కూడా ఉంటారు. అలాంటి వారిలో ఒకరే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య.
ఏ ఆర్భాటం లేకుండా పార్లమెంటుకు సైకిల్‌పై వచ్చిన మన్సుఖ్ మాండవ్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రజలకు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అవగాహన అందించడం తన బాధ్యతగా భావించే మన్సుఖ్.. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశ్యంతో బుధవారం ఉదయం ఇలా రాజ్యసభకు వెళ్తూ కనిపించారు.
మన్సుఖ్ మాండవ్య ఇలా చేయడం ఏమీ మొదటిసారి కాదు.. ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో ఆయన సైకిల్‌పైనే పలు ప్రదేశాలకు వెళ్తూ కనిపించారు. ఇది ఆయనకు అలవాటు. మొదటిసారి నవంబర్ 2021లో ఆయన సైకిల్‌పై కనిపించారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజల్లో ఫిట్‌నెస్ అలవాట్లను మరింతగా పెంపొందించే ప్రయత్నంతో మన్సుఖ్ మాండవియా సైకిల్ తొక్కుతూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో హెల్త్ పెవిలియన్‌ను ప్రారంభించారు. అప్పటినుండి సందర్భం వచ్చినప్పుడల్లా మన్సుఖ్ సైకిల్ ప్రయాణాలనే చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com