Margaret Alva: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరేట్ అల్వా నామినేషన్..

Margaret Alva: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరేట్ అల్వా నామినేషన్..
Margaret Alva: విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి మార్గరేట్ అల్వా నామినేషన్ వేశారు.

Margaret Alva: విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి మార్గరేట్ అల్వా నామినేషన్ వేశారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్‌కుమార్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. మార్గరేట్ అల్వా నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, జైరాం రమేష్, మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపతి ముర్ముకు శివసేన అధినేత, మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రే మద్దతు ఇవ్వగా.. ఆపార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అనూహ్యంగా విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరేట్ అల్వా నామినేషన్‌కు రావడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపిన విపక్షాలు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ పోటీపడుతోంది. ఎన్డీయే తరుపున వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌కర్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో మార్గరెట్‌ అల్వా.. కేంద్రమంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. అలాగే రాజస్థాన్, గోవా, గుజరాత్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గానూ పని చేశారు. ఆగష్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగష్టు 10తో ముగియనుంది.

Tags

Read MoreRead Less
Next Story