Vice President : ఉపరాష్ట్రపతి అభ్యర్ధి బరిలో మార్గరెట్ అల్వ

Vice President : ఉపరాష్ట్రపతి అభ్యర్ధి బరిలో మార్గరెట్ అల్వ
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా కేంద్రమాజీ మంత్రి, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా బరిలో నిలవనున్నారు.

Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్రమాజీ మంత్రి, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా బరిలో నిలవనున్నారు. అల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు NCP అధినేత శరద్ పవార్ ప్రకటించారు. పవార్ నివాసంలో జరిగిన భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై 17పార్టీల నేతలు ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు.

1942లో మంగళూరులోని రోమన్‌ కాథలిక్‌ కుటుంబంలో జన్మించిన మార్గరెట్...గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. మాజీప్రధానులు పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీల హయాంలో...మార్గరెట్‌ కేంద్రమంత్రిగా సేవలందించారు. మార్గరెట్‌ 1974నుంచి 1998 వరకు పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగారు.

Tags

Next Story