Maharashtra Bus accident :బస్సు ప్రమాద మృతులకు సామూహిక అంత్యక్రియలు

Maharashtra Bus accident :బస్సు ప్రమాద  మృతులకు సామూహిక అంత్యక్రియలు
మృతదేహాలు గుర్తు పట్టలేకుండా మాడిపోవటమే కారణం

మహారాష్ట్ర బస్సు ప్రమాద మృతులకు సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం బుల్దానాలోని శ్మశానవాటికలో ఈ కార్యక్రమం జరిగినట్లు అధికారులుప్రకటించారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.మహారాష్ట్ర బస్సు ప్రమాదంలో మొత్తం 25 మంది చనిపోగా ఒకరి మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా 24 మృతదేహాలకు సామూహికంగా అంత్యక్రియలు చేశామని అధికారులు వెల్లడించారు. బుల్దానాలోని ఓస్మశాన వాటికలో ఈ కార్యక్రమం జరిగింది. స్మశాన వాటిక వద్దకు భారీగా మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

మృతుల్లో 11 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనలో డ్రైవర్ అతని సహాయకుడితో పాటు మరో ఆరుగురు ప్రాణాలతో భయపడ్డారు. ముందుగా బస్సు టైర్ పేలిపోవడం తర్వాత బస్సు డివైడర్ కి గుద్దుకు పోవడం వలనే ప్రమాదం సంభవించిందని పోలీసులు భావించారు. అయితే డ్రైవర్ నిద్రపోవడం వల్లే బస్సు అదుపు తప్పిందని తమ ప్రాథమిక విచారణలో తేలిందని తాజాగా వెల్లడించారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినందుకు గాను డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.

మహారాష్ట్రలోని బుల్దానా లో సమృద్ధి మార్గ ఎక్స్ప్రెస్ హై వే పై శనివారం వేకువ జామున 1.30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు నాగపూర్ నుంచి పూణేకు 33 మందితో వెళుతూ అదుపు తప్పింది పక్కన ఉన్న స్తంభాన్ని ఆ తర్వాత డివైడర్ను ఢీ కొట్టింది. డీజిల్ ట్యాంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాప్తించాయి. దీంతో 25 మంది ప్రాణాలను కోల్పోయారు. మిగిలిన వారు గాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story