Encounter: ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్..

ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలకు.. మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారు. భీకర కాల్పుల తర్వాత భద్రతా బలగాలు గాలించగా 14 మంది మావోల మృతదేహాలు దొరికాయి. అయితే, గరియాబాద్ డీఆర్ జీ, ఒడిశా ఎస్ ఓజీ దళాలు కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. మరణించిన మావోయిస్టులను గుర్తించే పనిలో భద్రతా సిబ్బంది నిమగ్నమైంది.
అయితే, చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఎదురు కాల్పుల ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడగా.. అతడ్ని చికిత్స కోసం హెలికాపర్ట్ లో రాయపూర్ కు తరలించి ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇంకా మావోల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఈ నెల 16న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూజారికాంకేర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మరణించారు. అదే రోజు 12 మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది 12 మంది కాదని, మొత్తం 18 మంది మృతిచెందారని మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. పోలీసులు గుర్తించిన 12 మం ది మృతుల్లో సింహభాగం హిడ్మా పీఎల్‌జీఏ ఒకటో బెటాలియన్‌కు చెందినవారే ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com