Fire Accident: పశ్చిమ బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం!

Fire Accident: పశ్చిమ బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం!
X
ఇంజిన్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంజిన్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీ లో మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన ఫైర్‌ అధికారులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోల్‌కతాలోని ధాపాలో గల షైరాబాద్‌లోని ఇంజిన్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. 5 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story