Delhi: ఢిల్లీలో నడిరోడ్డుపై భారీ గొయ్యి

రాజధాని నగరం ఢిల్లీలో బిజీగా ఉండే నడిరోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. జనక్‌పురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలకు కుంగిన రోడ్డుపై భారీ స్థాయిలో రంధ్రం ఏర్పడింది. ఉదయం 7.45 గంటల సమయంలో ఇది జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు, మరణించలేదు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది.
ఉదయం సమయంలో నిత్యం పాఠశాలల బస్సులు, విద్యార్థుల రాకపోకలతో బిజీగా ఉండే పోసింగిపూర్ చౌక్‌లో ఈ గొయ్యి ఏర్పడటంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు.
#WATCH | A large portion of road caved in Delhi's Janakpuri area this morning. No injuries were reported. pic.twitter.com/otjQitTJix
— ANI (@ANI) July 5, 2023
ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు గొయ్యి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు ప్రజలెవ్వరూ అటువైపు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో నిన్నటి నుంచి 0.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com