Honeytrap: ఈ నేహాని చూసి ఆహా.. అన్నారో అయిపోయినట్టే..

ఎదుటి వారి కోరికలు ఆసరాగా చేసుకొని ముంచేసే మోసగాళ్లు ఎక్కువ అయిపోయారు. డబ్బు లేదా అమ్మాయి ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఆశ చూపి అమాయకులను వాడేసుకుంటున్నారు . ఏదో కక్కుర్తి పడి నాలుగు అడుగులు అటుగా వేసారా ఇంక అంతే.. మొత్తం కొట్టేసి చెక్కెస్తున్నారు. అమ్మాయిల పేరుతో వలపు వల వేయడం ‘హనీ ట్రాప్’. ఇప్పుడు ఈ వ్యవహారాలైతే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఒక అమ్మాయిని రంగంలోకి దింపి, సోషల్ మీడియా యాప్స్ ద్వారా అబ్బాయిల్ని బుట్టలో పడేసి, బెడ్రూమ్‌కి పిలుపించుకున్న తర్వాత బెదిరింపులకు పాల్పడి.. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారు. బెంగుళూరులోనూ ఒక ముఠా ఇలాంటి పాడుపనికే పాల్పడుతూ వచ్చింది. ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని, ఏకంగా 50 మంది పురుషులను లైన్లో పెట్టారు. చివరికి.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ బండారం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే..
ఈజీ మనీకి బాగా అలవాటుపడిన ప్రకాశ్ బాలిగర్, అబ్దుల్ ఖాదర్, యాసీన్ అనే ముగ్గురు వ్యక్తులు.. ఒక ముఠాగా ఏర్పడ్డారు. ‘హనీ ట్రాప్’తో డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం నేహా మెహర్, ఆమె స్నేహితుడు నదీమ్ సహకారం తీసుకున్నారు. తమ ప్లాన్‌ని అమలు చేయడానికి ముందు.. వీరు ఒక రూమ్ తీసుకుంటారు. అందులో రహస్యంగా కెమెరాలు అమరుస్తారు. అప్పటికే టెలిగ్రామ్ యాప్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న కొందరిని నేహా తన ఇంటికి లేదా రూంకి రమ్మని పిలుస్తుంది. ఏకాంత క్షణాలు గడిచాక అప్పటినుంచి డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. తాము అడిగినంత డబ్బులిస్తే విడిచిపెడతామని, లేకపోతే వీడియోని ఆన్‌లైన్‌లో పెట్టేస్తామని బ్లాక్‌మెయిల్‌కి దిగేవారు. తమ రహస్య వీడియో బయటపడితే, ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో.. చాలామంది ఆ ముఠా సభ్యులు అడిగినంత డబ్బులు సమర్పించుకున్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి ఈ బెదిరింపులకు లొంగక పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ప్రకాశ్, అబ్దుల్, యాసీన్‌లను అరెస్ట్ చేశారు. కానీ.. నేహా మాత్రం పరారీలో ఉంది. మీకు ఎక్కడైనా ఈ నేహా కనిపిస్తే ఆఁహాఁ అనుకుంటూ వెనుక పడకండి.. పోలీసులకు సమాచారం అందించండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com