G-20 Summit: విదేశీ నేతలు ఇక్కడికి... శునకాలు అక్కడికి

ప్రతిష్ఠాత్మక ‘జీ-20’ శిఖరాగ్ర సదస్సు (G-20 Summit)కు భారత్ సిద్ధమవుతోంది. ఢిల్లీ వేదికగా సెప్టెంబరులో జరగనున్న ఈ సమావేశానికి దేశాధినేతలు, పెద్దఎత్తున విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటికే తుది దశ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రధాన వేదిక అయిన ఐటీపీఓ కాంప్లెక్స్ (ITPO Complex)’ను ఆధునికీకణ కూడా పూర్తయింది.
వివిధ దేశాల అధినేతలు, ప్రముఖులు జీ 20 సదస్సుకు తరలి వస్తుండడంతోఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్( MCD) అప్రమత్తమైంది. G20 సమ్మిట్ దృష్ట్యా దేశ రాజధానిలోని ప్రముఖ ప్రదేశాల నుంచి(prominent locations in the national capital) వీధి కుక్కల(remove street dogs)ను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆగస్టు 4 న ప్రారంభమైన వీధి కుక్కల(street dogs) తరలింపు ఆగస్టు 30 వరకు కొనసాగుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని, తర్వాత తాత్కాలికంగా వైద్యులు నిర్వహించే ప్రత్యేక కేంద్రాలలో ఉంచుతామని వెల్లడించారు.
స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వెటర్నరీ డాక్టర్ల సహాయంతో వీధికుక్కల తొలగింపు కోసం భారీ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ ప్రదేశాల నుంచి తీసుకెళ్లిన వీధి కుక్కలను కార్యక్రమం పూర్తయ్యే వరకు వైద్యుల సంరక్షణలో ఉంచుతామని, ఆహారం కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ABC డాగ్ రూల్స్ 2001 ఇప్పుడు 2023 ప్రకారం, వీధికుక్కలను ఎక్కడ నుంచి తీసుకువెళ్లారో అదే ప్రాంతంలో తిరిగి విడుదల చేయాలి. G-20 సమ్మిట్ కారణంగా ABC సెంటర్‌లో తాత్కాలికంగా ఉంచి.. సదస్సు పూర్తి కాగానే తీసుకొచ్చిన ప్రాంతంలోనే వదిలేస్తామని అధికారులు తెలిపారు. కుక్కలను పట్టుకునేటప్పుడు, తిరిగి వదిలేటప్పుడు ఎటువంటి గాయం కాకుండా చూసుకోవాలని సంబంధిత శాఖ ఆదేశాలు జారీ చేసింది.
సంపన్న, పారిశ్రామిక దేశాలు; బలీయ వర్ధమాన దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమే జీ20. ఆసియా దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో 1999లో జీ20 కూటమి ఏర్పాటైంది. అప్పటినుంచి జీ20 ప్రతినిధులు ఏటా సమావేశమై ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక సమస్యలపై చర్చిస్తూ వస్తున్నారు. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ20 దేశాల్లోనే నివసిస్తున్నారు. జీ20 సంఘానికి ఏటా ఒక సభ్య దేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో భారత్ జీ 20 అధ్యక్ష పగ్గాలు స్వీకరించింది. జీ20 అధ్యక్ష హోదాలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 32 విభిన్న రంగాల్లో 200 సమావేశాలు నిర్వహించింది. ఇంకా నిర్వహిస్తోంది.
ఉక్రెయిన్ యుద్ధంపై స్వతంత్ర వైఖరి అవలంబించిన భారత్.. డిజిటల్ సీమలో అనితర సాధ్య విజయాలను అందుకొంది. కొవిడ్ మహమ్మారిని విజయవంతంగా అధిగమించి ప్రపంచానికి టీకాలు, మందుల సరఫరాదారుగా నిలిచింది. జీ20 అధ్యక్ష హోదాలో ప్రపంచ సారథుల్లో భారత్ స్థానం పొందే అవకాశం లభిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com