ఐఐటి విద్యార్థి కాదు.. అయినా రూ. 64.15 లక్షల ప్యాకేజీ : రైతు కుమార్తె సక్సెస్ స్టోరీ

టాప్ టెన్ కాలేజీల్లో చదువుకుంటే టాప్ కంపెనీల్లో ఉద్యోగం వస్తుంది. మంచి జీతం కూడా వస్తుంది. అని చిన్నప్పటినుంచి అటు అమ్మానాన్నలకు, ఇటు పిల్లలకు మెదళ్లలో పాతుకుపోయిన భావాలకు కాలం చెల్లింది. విషయం ఉండాలే కానీ ఎక్కడ చదువుకున్నామన్నది ముఖ్యం కాదు అని నిరూపిస్తున్నారు నేటి తరం విద్యార్ధులు. ఐఐటీ చదువులు చదవకపోయినా పెద్ద పెద్ద కంపెనీల్లో భారీ జీతాలకు ఎంపిక అవుతున్నారు. వారి ప్రతిభను ఫణంగా పెట్టి అవకాశాలను దక్కించుకుంటున్నారు. చెన్నైకు చెందిన ఓ రైతు కుమార్తె రూ. 64.15 లక్షల ప్యాకేజీని అందుకుని సంచలనం సృష్టించింది.
తమిళనాడులోని సేలం నుండి వచ్చిన, రమ్య కఠినమైన ఎంపిక ప్రక్రియలను అధిగమించింది. ఐదు నుండి ఆరు రౌండ్ల ఇంటర్వ్యూలను పూర్తి చేసి ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది. ఆమె అసాధారణమైన తెలివితేటలకు, విశ్లేషణాత్మక నైపుణ్యాలకు ఇంటర్వ్యూ చేసే వారు కూడా అవాక్కయ్యారు.
తమిళనాడుకు చెందిన ఒక రైతు కుమార్తె రమ్య ఆర్, సింగపూర్‌కు చెందిన తొలారం గ్రూప్ నుండి అధిక వేతనంతో కూడిన ఉద్యోగ ఆఫర్‌ను పొందారు. IIM సంబల్‌పూర్‌లో ప్లేస్‌మెంట్ సీజన్‌లో కంపెనీ రమ్యకు రికార్డు స్థాయిలో రూ. 64.15 లక్షల ప్యాకేజీని అందించింది. ఆమె నైజీరియాలోని సంస్థలో చేరింది. రమ్య కఠినమైన ఇంటర్వ్యూ ప్రక్రియను సునాయాసంగా అధిగమించింది.
ఐదు నుండి ఆరు రౌండ్ల ఇంటర్వ్యూలను అవలీలగా పూర్తి చేసింది. 22 సంవత్సరాల వయస్సులో, రమ్య మూస పద్ధతులను బద్దలు కొట్టడం గురించి వివరిస్తూ, "మా గ్రామంలోని మహిళలు సాధారణంగా తమ చదువుల కోసం బయటకు వెళ్లరు. కానీ కాలం మారుతోంది, నాలాంటి యువతులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను."
IIMలో చేరడానికి ముందు, రమ్య తమిళనాడులోని నామక్కల్‌లో లిటరేచర్ చదువుకుంది. ఆమె కుటుంబంలో మొదటి గ్రాడ్యుయేట్‌గా గుర్తింపు పొందింది. తన విజయవలో భాగమైన IIM సంబల్‌పూర్ అధ్యాపకులు పోషించిన కీలక పాత్రను ఆమె గుర్తు చేసుకుంది.
రమ్య తన విజయానికి మూల కారకులైన తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. రైతులుగా వారి అంకితభావం నుండి పొందిన ప్రేరణ పొందినట్లు చెబుతుంది. ఆమెలోని పట్టుదల, పని పట్ల నిబద్దత ఆమెను ఈ స్థాయికి చేర్చిందని తమ కూతురి గురించి తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
IIM సంబల్‌పూర్‌లో రమ్య యొక్క ప్రయాణం ఆమెను ఒక సంచలనాత్మక అంతర్జాతీయ కెరీర్ వైపు నడిపించడమే కాకుండా విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన ఔత్సాహిక వ్యక్తులకు ప్రేరణగా కూడా ఉపయోగపడుతుంది. రమ్య పట్టుదల, సంకల్పం, విద్య యొక్క పరివర్తన శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com