మొదటి ప్రయత్నంలోనే UPSC ర్యాంక్.. మాజీ జాతీయ స్థాయి క్రికెటర్ సచిన్ అతుల్కర్ సక్సెస్ స్టోరీ

IAS అధికారుల జీవితాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వీరి సక్సెస్ స్టోరీలు చాలా మందిని ప్రేరేపించగలవు. జాతీయ స్థాయి క్రికెట్ ఆటగాడి నుంచి ఐపీఎస్ అధికారి కావాలనే కలను నెరవేర్చుకునే వరకు సచిన్ అతుల్కర్ జీవిత ప్రయాణం కూడా అందుకు భిన్నమైనది ఏమీ కాదు. తన నిబద్ధత, పట్టుదలతో చాలా మందిని అతుల్ ప్రేరేపించారు. యువతకు అతడు రోల్ మోడల్ గా నిలిచాడు. అతని స్ఫూర్తిదాయకమైన కథను మనమూ తెలుసుకుందాం.
సచిన్ అతుల్కర్ వ్యక్తిగత జీవితం: పాఠశాల విద్య నుండి UPSC AIR ర్యాంక్ 258 వరకు మధ్యప్రదేశ్‌కు చెందిన సచిన్ అతుల్కర్ ఆగస్టు 8, 1984న జన్మించాడు. అతను బికామ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, అతను భారతదేశంలో జాతీయ పోటీ పరీక్ష అయిన UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) కోసం ప్రిపేర్ అయ్యాడు. 22 ఏళ్ల యువకుడు తన మొదటి ప్రయత్నంలోనే 2006లో 258వ ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)తో పోటీ పరీక్షలో విజయం సాధించాడు. 22 ఏళ్ల వయస్సులో చాలామందికి తాము జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టత ఉండదు. అతుల్ కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ ఎందుకో ఆ క్షణంలో సివిల్స్ రాయాలనిపించింది. దాన్ని ఆషామాషీ వ్యవహారంగా తీసుకోలేదు. పట్టుదలగా ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించాడు. అతను ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) లో చేరాడు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తాడు. క్రమం తప్పని వ్యాయామం అతడి శారీరక, మానసిక స్థితికి దోహదపడింది. అతని అసాధారణమైన శరీరాకృతి మోడల్ ని గుర్తుకు తెస్తుంది. అందుకే అతన్ని "హ్యాండ్సమ్ పోలీస్ ఆఫీసర్" అని కూడా పిలుస్తారు. ఫలితంగా, అతను తరచుగా సామాజిక సమావేశాలకు ఆహ్వానించబడతాడు.
మాజీ జాతీయ స్థాయి క్రికెటర్‌గా సచిన్ అతుల్కర్ జర్నీ.. క్రీడలు సచిన్ అతుల్కర్ కు చాలా ఇష్టమైన అంశం. ముఖ్యంగా క్రికెట్ లో అతను చెప్పుకోదగ్గ పురోగతిని సాధించాడు. 1999లో జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడి బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. దానికి తోడు గుర్రపు స్వారీలో కూడా బంగారు పతకం సాధించాడు. సాధారణంగా, సివిల్ సర్వెంట్లు సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవ్వరు. కానీ ఇటీవలి కాలంలో ఐఏఎస్ అధికారులు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌లుగా మారిపోతున్నారు. ప్రస్తుతం సచిన్ అతుల్కర్‌కు కూడా 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com