పాత కళను పునరుద్ధరించే లక్ష్యం.. పోటర్ గా మారిన సివిల్ ఇంజనీర్

పాత కళను పునరుద్ధరించే లక్ష్యం.. పోటర్ గా మారిన సివిల్ ఇంజనీర్
ఇంజనీర్ చదువు, ఆరంకెల జీతం.. అయినా ఎందుకో నిరాసక్తత.. ఏదో చేయాలన్న తపన.

ఇంజనీర్ చదువు, ఆరంకెల జీతం.. అయినా ఎందుకో నిరాసక్తత.. ఏదో చేయాలన్న తపన.. ఆమెను ఆ ఉద్యోగం చేయనివ్వలేదు.. మట్టిపై ఉన్న మోహంతో పాట్ కళకు పదును పెట్టింది. మట్టి ముద్దతో మురిపించే బొమ్మలు తయారు చేస్తోంది.

మట్టిపై షఫీకి ఉన్న మోహం ఆమె చిన్ననాటి నుంచి సాగుతుంది. ఎప్పుడూ అందరికంటే భిన్నంగా ఏదో ఒకటి చేయాలని తపన పడుతూ ఉండేది. దానినే ఇప్పుడు తన ఉపాధిగా మార్చుకుంది. చిన్నప్పటి నుంచి మట్టితో చేసిన బొమ్మల పట్ల ఆకర్షితురాలయ్యేది. దాంతో పోటర్ కావాలని నిర్ణయించుకుంది.

జమ్మూ కాశ్మీర్‌లోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సైమా షఫీ, ఆధునిక పద్ధతుల ద్వారా అంతరించిపోతున్న కుండల కళను బ్రతికించాలనుకుంది. కాశ్మీరీలో కుమ్మరి అమ్మాయిని క్రల్ కూర్ అని పిలుస్తారు. ఆమెకున్న ఆసక్తి, ఆధునిక కుండలను రూపొందించడానికి కళాకారులు ఉపయోగించే ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకునేలా చేసింది. సైమా షఫీ స్థానికంగా పరిశోధనలు చేసి, రాష్ట్రం వెలుపల ఉన్న నిపుణులతో కూడా క్లాసులు తీసుకుని, సొంతంగా కుండల స్టూడియోను సృష్టించారు.

ఆసక్తి ఉన్న పని చేస్తే నిరాశ దూరమవుతుంది అంటుది షఫీ. ఆమె ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, అనేక అడ్డంకులను ఎదుర్కొంది. "కుండల తయారీకి అవసరమైన ఆధునిక పరికరాలు.. ఎలక్ట్రికల్ పాటర్ వీల్, బేకింగ్ కోసం ఉపయోగించే గ్యాస్ బట్టీ, ఈ రెండూ ఇక్కడ అందుబాటులో లేవు. బెంగళూరు వెళ్లి అక్కడ ఆమె వంటగదిలో ఉపయోగించే సాంప్రదాయ కాశ్మీరీ పాత్రలతో సహా మట్టిని వివిధ ఆకారాల్లో అచ్చువేసే కళలో క్రాష్ కోర్సు చేసింది.

కోవిడ్ సమయంతో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అయినా తన అభిరుచికి పదును పెట్టుకుంటూ, దృఢ నిశ్చయంతో ముందుకు సాగింది. కాశ్మీర్‌లో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. అనుభవజ్ఞులైన కుమ్మరులతో చర్చలు జరిపింది. వివిధ కార్యక్రమాలు, వేదికలలో చురుకుగా పాల్గొంది. కళకు హద్దులు దాటి ప్రజలను ఒకచోట చేర్చే శక్తి ఉంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మా వారసత్వాన్ని ప్రదర్శించడం ద్వారా తమ ఉత్పత్తులు త్వరగా జనానికి చేరువయ్యాయి అని సైమా తెలిపింది.

పురాతన కుండల తయారీ కళ జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం దృష్టిని ఆకర్షించింది. సెంట్రల్ కాశ్మీర్‌లోని బీర్వా కళాకారులతో తన అనుభవాలను పంచుకోవడానికి ఇటీవల రాష్ట్ర హస్తకళల శాఖ ఆమెను ఆహ్వానించింది. హస్తకళాకారులతో జరిపిన చర్చల కారణంగా కాశ్మీర్‌లో కుండల పునరుద్ధరణకు అధిక స్పందన లభించింది. దీంతో హస్తకళల శాఖ అధికారి వారి కోసం పథకాలను రూపొందించడానికి కళాకారుల డేటాను సేకరించాలని నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story