MODI: మన మట్టి-మన దేశం ఇదే నినాదం

MODI: మన మట్టి-మన దేశం ఇదే నినాదం
ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలన్న మోదీ... దేశవ్యాప్తంగా అమృత్‌ కలశ యాత్ర

స్వాతంత్ర్య దినోత్సవాన్ని( Independence Day) పురస్కరించుకొని ప్రతి ఒక్కరు తమ ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని మోదీ(PM Modi ) పిలుపునిచ్చారు. దీని ద్వారా మన కర్తవ్యంతో పాటు దేశం కోసం ఎంతో మంది చేసిన త్యాగాలు(Independence Day to honour the martyred bravehearts ) గుర్తుకు వస్తాయని అన్నారు. 103వ మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) ప్రసంగించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించుకుంనేందుకు ప్రధాని మోదీ కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేరీ మాటి మేరా దేశ్‌‍( Meri Mati Mera Desh ) పేరుతో దేశ వ్యాప్తంగా అమరవీరులు గౌరవార్థం పలు కార్యక్రమాలు(programmes will be organised across India ) నిర్వహించనున్నట్లు చెప్పారు.


అమరవీరులకు గౌరవ సూచకంగా దేశంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక శాసనాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమృత్‌ కలశ యాత్ర(Amrit Kalash Yatra) పేరుతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7 వేల 500 కలశాల్లో మట్టి, మొక్కలను సేకరించి( 7,500 'kalash' from villages and various corners) దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం పక్కనే అమృత్‌ వాటిక(Amrit Vatika) పేరుతో ప్రత్యేక స్థూపాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ (Ek Bharat Shresth Bharat,)కు ప్రతీకగా ఈ అమృత్‌ వాటిక నిలుస్తుందని ప్రధాని తెలిపారు.


12 వేల కోట్ల విలువైన 10 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసి భారత్‌ రికార్డు నెలకొల్పిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్క రోజులో 30 కోట్ల మెుక్కలను నాటడం ప్రజల భాగస్వామ్యం, అవగాహనకు నిదర్శమని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారందరినీ ప్రధాని అభినందించారు. మాదకద్రవ్యాలకు బానిస కావడం కుటుంబానికే కాకుండా యావత్తు సమాజానికే పెద్ద సమస్యగా అభివర్ణించారు.

అకాల వర్షాల కారణంగా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో సంభంవించిన వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడిన తీరును ప్రధాని అభినందించారు. 4,000 మందికి పైగా మహిళలు మగ తోడు లేకుండా హజ్ యాత్ర చేయగలిగారని, ఇదో అతి పెద్ద మార్పని మోదీ అన్నారు. హజ్ నుంచి తిరిగి వచ్చిన ముస్లిం మహిళలు తనకు లేఖలు రాశారని చెప్పారు. మగతోడు లేకుండా హజ్‌ యాత్రకు అనుమతిచ్చిన సౌదీ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story