Manipur: మణిపుర్‌లో మరోసారి హింస. 13 మంది మృతి

మణిపుర్‌లో రెండు మిలిటెంట్ గ్రూప్‌ల మధ్య జరిగిన పరస్పర కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ ప్రాంతంలో ఉన్న తెంగ్నౌపాల్ జిల్లాలోని లీతు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లా మయన్మార్‌తో సరిహద్దు కలిగి ఉంది. ఒక మిలిటెంట్ గ్రూప్‌నకు చెందిన మిలిటెంట్లు మయన్మార్ వెళ్తుండగా...ఆ ప్రాంతంలో పట్టు ఉన్న తిరుగుబాటుదారులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటన జరిగిన ప్రదేశానికి భద్రతా బలగాలు చేరుకోగా అక్కడ 13 మృతదేహాలు వారికి లభ్యమయ్యాయి. మృతులను గుర్తించాల్సి ఉంది. వారెవరూ స్థానికులు కాదని తెలుస్తోంది.
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తేంగనౌపల్ జిల్లాలో రెండు మిలిటెంట్ గ్రూపుల మధ్య ఎదురెదురు కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. లెయితు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో 13 మంది మరణించారు. ఒక మిలిటెంట్ల గ్రూపు మయన్మార్ వెళ్తుండగా ఆ ప్రాంతంలో ఆధిపత్యం ఉన్న మరో మిలిటెంట్ గ్రూప్ వారిపై దాడి చేసినట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలోనే భద్రతా బలగాలు ఉండటంతో ఈ సమాచారం అందిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మృతదేహాల పక్కన ఎలాంటి ఆయుధాలు కనిపించలేదని, అలాగే ఈ చనిపోయిన వాళ్లు స్థానికులు కాదని ప్రాధమిక సమాచారం. ఆదివారం తెంగ్నౌపాల్ జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో కుకీ-జో గిరిజన వర్గాలు ఈ శాంతి ఒప్పందాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేశాయి. దీంతో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు మినహా రాష్ట్రమంతా ఇంటర్నెట్ సేవలను మణిపుర్ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.
మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ గొడవల్లో 182 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. హింసాత్మక సంఘటనలతో అట్టుడికిన మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులపై ఏడు నెలల క్రితం విధించిన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారంనాడు ఎత్తివేసింది. డిసెంబరు 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది అయితే, సరిహద్దు ప్రాంతంలోని 9 జిల్లాల్లో మాత్రం నిషేధం కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com