Droupadi Murmu: రాష్ట్రపతి తో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతుల సమావేశం

Droupadi Murmu: రాష్ట్రపతి తో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతుల సమావేశం
X
ఆపరేషన్‌ సిందూర్‌ గురించి రాష్ట్రపతికి వివరించిన అధికారులు..

భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును “ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టేట్” (సీడీఎస్) అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు కలిశారు. సైన్యం అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావికాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్మును కలిసి “ఆపరేషన్ సిందూర్” విజయం గురించి వివరించారు అధికారులు. ఇక, ఉగ్రవాదంపై భారతదేశం ప్రతిస్పందించిన తీరును, సాయుధ దళాల శౌర్యం, అంకితభావాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు.

Tags

Next Story