Miss Kolkata Models: దుర్గామాత దగ్గర పొట్టి పొట్టి డ్రెస్సుల్లో పోజులు, తిట్టిపోస్తున్న నెటిజన్లు

దసరా నేపథ్యంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపానికి ముగ్గురు మోడల్స్ వెళ్లారు. అసభ్యకరంగా ఉన్న దుస్తులను వారు ధరించారు. అలాగే కాళ్లకు చెప్పులతోనే మండపంలోకి వెళ్లారు. దుర్గా మాత విగ్రహం ముందు ఫొటోలు దిగారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు మోడల్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. నవరాత్రుల నేపథ్యంలో కోల్‌కతాలో దుర్గా మాతా మండపాలను వినూత్న రూపాల్లో ఏర్పాటు చేస్తుంటారు.
కాగా, మిస్ కోల్‌కతా మోడల్స్ అయిన హేమోశ్రీ, భద్ర, సన్నతి మిత్ర ఒక దుర్గా మాతా పూజా పండల్‌ను సందర్శించారు. అయితే సంప్రదాయ దుస్తులకు బదులుగా అసభ్యకరంగా, రెచ్చగొట్టేలా ఉన్న దుస్తులను వారు ధరించారు. అలాగే కాళ్లకు చెప్పులతోనే అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి ఫొటోలు దిగారు.
మరోవైపు ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వారు పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ మోడల్స్‌పై నెటిజన్లు మండిపడ్డారు. దుర్గా పూజ వేడుకకు అసభ్యకర దుస్తుల్లో హాజరుకావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళ్లకు చెప్పులతో విగ్రహం ముందు ఫొటోలు దిగడాన్ని తప్పుపట్టారు. ఇది సిగ్గుచేటని కొందరు విమర్శించారు. దుర్గా మాత అమ్మవారిని, ఆధ్యాత్మికతను గౌరవించని వీరు ఎలాంటి మహిళలు అని మరికొందరు ప్రశ్నించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com