Kashmir : అందాల కశ్మీరులోయలో ప్రపంచ సుందరాంగులు

Kashmir : అందాల కశ్మీరులోయలో  ప్రపంచ సుందరాంగులు
శ్రీనగర్ లో విహరించిన అందాల భామలు

ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు కశ్మీర్ లోయ. ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో అందాల కశ్మీర్ రేంజే వేరు. అలాంటి అందాల లోకం లో ప్రపంచ సుందరాంగులు విహరించారు. ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్కాతోపాటు పలువురు అందాల రాణులు, ప్రకృతి పరవశించే కశ్మీరు లోయలో విహరించి అనందానుభూతి పొందారు. మిస్ వరల్డ్ 2023కి ప్రీ ఈవెంట్ శ్రీనగర్‌లో జరిగింది. ఈ నేపధ్యం లో ప్రపంచంలోని అందాల సుందరులు ఒక రోజు శ్రీనగర్ లో పర్యటించారు.

మిస్ వరల్డ్ అమెరికా శ్రీ సైనీ, మిస్ వరల్డ్ ఇండియా సినీ శెట్టి, మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ జెస్సికా గాగెన్, మిస్ ఆసియా, ప్రిసిలియా కార్లా సపుత్రి యూల్స్ కశ్మీరు అందాలను చూసి మురిసిపోయారు. ప్రకృతి రమణీయతకు పరవశించిపోయారు. ఈ పర్యటనలో అందాల భామలతోపాటు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్, సీఈఓ జూలియా ఎరిక్ మోర్లీ కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న మిస్ వరల్డ్ 2023 పోటీల 71వ ఎడిషన్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.


అందాల భామలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ లేక్‌తో సహా శ్రీనగర్ నగరంలో పర్యటించారు. మంచు కురిసినా, కురవకపోయినా సరే కశ్మీర్ అందం ఎన్నటికీ తగ్గదు..ఇదొక భూతల స్వర్గంగా అందాల రాణులు ప్రశంసించారు. మిస్ ఇండియా పోటీల్లో ఆరుసార్లు ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకుంది భారత్. తొలిసారిగా రీటా ఫారియా 1966లో ఈ కిరీటాన్ని సాధించగా, ఐశ్వర్యరాయ్ బచ్చన్ 1994లో, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఈ కిరీటాలను గెలుచుకున్నారు. ఇక ఎప్పుడు మూడు దశాబ్దాల తర్వాత భారత్ ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. 1996లో ఇండియాలో ఈ పోటీలు జరగగా అందులో గ్రీస్‌కి చెందిన ఇరెనా స్క్లీవా కిరీటాన్ని గెలుచుకుంది. ఆ పోటీల్లో భారత్ టాప్ 5లో నిలిచింది.

ఈ పోటీల్లో 130 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటారు. మిస్ వరల్డ్ లిమిటెడ్, పీఎంఈ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా వీటిని నిర్వహిస్తారు. ఈ కాంపిటీషన్‌తో ఇంక్రెడిబుల్ ఇండియా నినాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పబోతున్నారు ఆర్టికల్ రద్దు, జి 20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలతో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దాదాపు 17 వేల మంది విదేశీయులు కాశ్మీర్ లోయలో విహరించారు.


Tags

Read MoreRead Less
Next Story