Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి వై ప్లస్ భద్రత కేటాయింపు

ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి వై-ప్లస్ భద్రత కేటాయించారు. ఇటీవల బాలీవుడ్ నటులకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ జాబితాలో మిథున్ చక్రవర్తి కూడా చేశారు. తాజాగా సోషల్ మీడియాలో బెదిరింపులు రావడంతో ఆయనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతను పెంచింది. మిథున్ చక్రవర్తిని పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ షాజాద్ బట్టి సోషల్ మీడియాలో బెదిరించాడు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు 10 నుంచి 15 రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వీడియో మెసేజ్‌లో షాజాద్ బెదిరించాడు. దీంతో ఆయనకు కేంద్రం భద్రత పెంచింది.
ఇదిలా ఉంటే కోల్‌కతా సమీపంలోని సాల్ట్ లేక్ ఏరియాలో అక్టోబర్ 27న జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మిథున్ చక్రవర్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నవంబర్ 6న ఆయనపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమబెంగాల్ పీఠం బీజేపీ వశం అవుతుందని, లక్ష్యసాధన కోసం ఏమి చేయడానికైనా సిద్ధమేనని మిథున్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈస్ట్ సింగ్భూమ్ జిల్లాలో మిథున్ రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండా తరఫున ఆయన ప్రచారం చేశారు.
సభలో మిథున్ పర్సు కొట్టేసిన జేబుదొంగలు
ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి ఝార్ఖండ్ లో చేదు అనుభవం ఎదురైంది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరఫున మిథున్ చక్రవర్తి ప్రచారానికి వచ్చారు. ఆయితే ఆయన పాల్గొన్న సభలో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఈ క్రమంలో, మిథున్ జేబులో ఉండాల్సిన పర్సు మాయమైంది.
తన పర్సు పోయిందన్న విషయాన్ని మిథున్ చక్రవర్తి సభ నిర్వాహకులకు తెలియజేశారు. దాంతో, నిర్వాహకులు పలుమార్లు మైక్ లో ప్రకటించారు. "మిథున్ చక్రవర్తి పర్సు ఎవరు తీసుకున్నారో దయచేసి తిరిగి ఇవ్వండి" అంటూ విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర నిరాశకు గురైన మిథున్ చక్రవర్తి నిర్ణీత సమయం కంటే ముందు సభ నుంచి వెళ్లిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com