DMK MK Stalin : డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సీఎం ఎంకే స్టాలిన్..

DMK MK Stalin : డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా మరోసారి సీఎంఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారు. ఇప్పటికే ఓసారి పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహించిన స్టాలిన్.. వరసగా రెండో సారి కూడా పార్టీ బాధ్యతలు చేపట్టారు. చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా దురైమురుగనన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీకి సంబంధించిన కీలక పదవులను ముగ్గురు నేతలు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు..
జనరల్ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్ కు డీఎంకే పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వివిధ పదవులకు ఎన్నికలు జరిగాయి.చివరగా పార్టీ అధ్యక్షుడు, కోశాధికారి, ప్రధాన కార్యదర్శికి ఎన్నికలు జరిగాయి. 69 ఏళ్ల స్టాలిన్ 2018లో కరుణానిధి చనిపోయిన తరువాత డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండో సారి మరోసారి ఎన్నికయ్యారు.
1969లో డీఎంకేకు మొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. పార్టీలో అధ్యక్ష పదవని తీసుకురావడం అప్పుడే మొదటిసారి. 1949లో స్థాపించిన డీఎంకే పార్టీకి అప్పటి వరకు ద్రవిడ ఉద్యమ నేత, పార్టీ డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com