MK Stalin : ఇండియా కూటమి గెలవకపోతే...

ఎలక్షన్ దగ్గర పడుతుందటంతో నేతలు ఒకరి పై ఒకరు విమర్శలకు దిగటం మాములే. ఇక మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడటాని ఇండియా కూటమి తన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు నేతలు కూడా సమయం దొరికినప్పుడు ఒకరు విమర్శించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మోడీ ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష కూటమి ఇండియా విజయం సాధించి తీరాలని లేకుంటే.. దేశమంతా మణిపూర్, హర్యానాలాగా తగలబడిపోతుందని అన్నారు.
స్పీకింగ్ ఫర్ ఇండియా అనే పాడ్‌కాస్ట్‌లో ఆయన బిజెపిపై విమర్శలు గుప్పించారు. సోమవారం ఉదయం ప్రసారమైన ఈ ఎపిసోడ్ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో వచ్చింది. గత 9 ఏళ్లలో సామాజిక సంక్షేమానికి సంబంధించి బిజెపి ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అప్పట్లో బిజెపి వాగ్దానం చేసినట్లుగా ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు ప్రజలందరి ఖాతాల్లోనూ జమ కాలేదని, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు.
మత విద్వేషాల ముసుగులో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తన కార్పోరేట్ స్నేహితులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. ఎయిర్ ఇండియా, విమానాశ్రయాలు, ఓడరేవులు బిజెపికి సన్నిహితంగా ఉండే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని కప్పిపుచ్చేందుకు పలు రాష్ట్రాల్లో కుల, మతవిద్వేషాలను రెచ్చగొడుతోందని ధ్వజమెత్తారు.
మరోవైపు 2002లో గుజరాత్‌లో నాటిన ద్వేషం మణిపూర్, హర్యానాకు విస్తంచిందని అన్నారు. భారతదేశం మొత్తం మణిపూర్, హర్యానాగా మారకుండా ఉండాలంటే ప్రతిపక్ష కూటమి ఇండియా కచ్చితంగా విజయం సాధించితీరాలని అన్నారు. భిన్న సంస్కృతులతో కూడిన భారతదేశ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, మత సామరస్యం, ఫెడరలిజం, లౌకిక విధానాలు, సోషలిజం పునరుద్ధరణ కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని అన్నారు.
మతం, కులం, భాషల ఆధారంగా దేశాన్ని విభజించేది డీఎంకే పార్టీ అని బీజేపీ ఎదురుదాడికి దిగింది. తమిళనాడుకు పన్ను ఆదాయంలో కేంద్ర తగిన ఆదాయం ఇచ్చిందని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి అన్నారు. డీఎంకేని ఉద్దేశిస్తూ కనీసం ఇప్పటికైనా స్టాలిన్ భారతదేశాన్ని ఒక దేశంగా ఒప్పుకున్నందుకు సంతోషం అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com