MK Stalin: డీఎంకే ప్రభుత్వానికి ఏడాది పూర్తి.. ఆర్టీసీ బస్సులో సీఎం స్టాలిన్ ప్రయాణం..

MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రతి అంశంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎం స్టాలిన్ సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రజలు, మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. తన ఏడాది పాలన, ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం స్టాలిన్ అనంతరం మెరీనాబీచ్‌కు చేరుకున్నారు. అక్కడ తన తండ్రి, మాజీ సీఎం కరుణానిధి, డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై సమాధుల వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకున్న సీఎం స్టాలిన్.. సభలో ఐదు కొత్త పథకాలను ప్రకటించారు. ప్రకటనలు చేశారు. ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ బ్రేక్ ఫాస్ట్, మీ నియోజకవర్గంలో సీఎం వంటి పథకాలను ప్రారంభిస్తున్నట్టు సీఎం స్టాలిన్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com