Karnataka: ప్రిన్సిపాల్ పై దాడి చేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

Karnataka: అతనో ప్రజా ప్రతినిధి. ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. కాని విచక్షణ మరిచారు. సమాజంలో ఉన్నతమైన గుర్తింపు ఉన్న అధ్యాపకుడిపై దారుణంగా వ్యవహరించాడు. క్లాస్ రూమ్ లో పిల్లలంతా చూస్తుండగానే.. కాలేజీ ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గురువుపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది. జేడీఎస్ పార్టీకి చెందిన మాండ్య ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్ మాండ్యలోని నల్వాడి కృష్ణ రాజా వడయార్ ఐటీఐ కళాశాలను సందర్శించారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అక్కడ కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పనుల పురోగతిపై కాలేజీ ప్రిన్సిపాల్ ను అడిగారు ఎమ్మెల్యే. అయితే ప్రిన్సిపాల్ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు.
ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించారు. ఒక్కసారి కాదు నాలుగు సార్లు ప్రిన్స్‌పాల్‌ను కొట్టారు ఎమ్మెల్యే శ్రీనివాస్. ఎమ్మెల్యే దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ప్రిన్సిపాల్ పై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ ఘటనకు తీసుకెళ్లాయి అద్యాపక సంఘాలు. ఎమ్మెల్యే తీరుపై జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Mandya @JanataDal_S MLA M Srinivas slapped Mandya ITI College Principal Naganand. MLA visited the college & principal allegedly didn't provide information on development work of college 2 MLA. Furious with the behaviour of Principal, MLA slapped principal in front his colleagues. pic.twitter.com/KBGZXuZ5s8
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) June 21, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com