MLA Humayun Kabir:బాబ్రీ మసీదు ప్రతిపాదన తెచ్చిన టీఎంసీ ఎమ్మెల్యే సస్పెన్షన్

వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి నాలుగోసారి అధికారం కోసం మమత.. ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి. ఇంకోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ‘SIR’పై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ గురువారం నిరసనకు మమత పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించాలనే ప్రాతిపాదనను తీసుకొచ్చారు. అయితే ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి మసీదు నిర్మాణంలో పాల్గొనబోరని.. సందేశాన్ని ఎమ్మెల్యేకు తెలియజేసినట్లు వర్గాలు తెలిపాయి.
అయితే డిసెంబర్ 6న ముర్షిదాబాద్‌లోని బెల్దంగాలో బాబ్రీ మసీదు ప్రతిరూపానికి శంకుస్థాపన చేయాలనే ప్రణాళికను ఎమ్మెల్యే తీసుకొచ్చారు. అయితే హుమాయున్ కబీర్ ప్రకటనలు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తుంటే… ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారని వర్గాలు తెలిపాయి. ముర్సీదాబాద్‌కు చెందిన ఎమ్మెల్యే అకస్మాత్తుగా బాబ్రీ మసీదును నిర్మిస్తానని చెప్పినట్లు గుర్తించామని, ఇప్పుడు ఎందుకు బాబ్రీ మసీదు అవసరం వచ్చిందని, ఇప్పటికే ఆయనకు వార్నింగ్ ఇచ్చామని, పార్టీ నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే హుమయూన్ కబీర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కోల్‌కతా మేయర్ ఫిర్హద్ హకీమ్ తెలిపారు.
ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ (SIR)కు నిరసనగా మమతా బెనర్జీ గురువారం భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా ముర్షిదాబాద్‌లో ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే భరత్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హుమాయున్ కబీర్‌ను కూడా పార్టీ ఆహ్వానించిందని, ఆయన ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

