MNS చీఫ్ రాజ్ థాకరే అమిత్ షాతో సమావేశం.. NDA లో చేరే అవకాశం

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఢిల్లీకి వెళ్లి అక్కడ హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అక్కడ అప్పటికే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే ఉన్నారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే మంగళవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజ్ థాకరే బిజెపి-శివసేన (ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని) కూటమిలో చేరవచ్చు అనే ఊహాగానాల మధ్య ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాజ్ థాకర్ ఢిల్లీ పర్యటన గురించి మీడియా ప్రశ్నించినప్పుడు.. "నన్ను ఢిల్లీకి రమ్మని చెప్పారు. అందుకే వచ్చాను. చూద్దాం ఏం జరుగుతుందో అని ఆయన తెలిపారు.
సమావేశ వివరాలను త్వరలో తెలియజేస్తామని ఎంఎన్‌ఎస్ నేత సందీప్ దేశ్‌పాండే తెలిపారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది మరాఠీలు, హిందుత్వ, పార్టీ ప్రయోజనాల కోసమేనని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com