PM Modi: త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ..సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ..

ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్చ, ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. త్రివిధ దళాధిపతుల సమావేశంలో మోదీ ఈ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. భారత సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు ప్రధాని మోదీ. యాక్షన్ ప్లాన్ లో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. ఎలాంటి జవాబు ఇవ్వాలో, టైమ్, ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యం అన్నారు ప్రధాని మోదీ.
మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి భారతదేశం ప్రతిస్పందన, సమయం, లక్ష్యాన్ని నిర్ణయించడానికి భారత సాయుధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఉందని ఆయన తెలియజేశారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. పర్యాటకులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడికి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లే కారణమని భారత్ చెబుతోంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. భారత సాయుధ దళాల సామర్థ్యాలపై ప్రధాని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సైన్యమే టార్గెట్ ప్లేస్, టైమ్ చూసి జవాబు ఇచ్చేలా త్రివిధ దళాలకు ‘‘పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ’’ను ఇచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని నేతృత్వంలో జరిగిన రెండో అత్యున్నత సమావేశం ఇదే. అంతకు కొన్ని రోజుల ముందు ‘‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’’ సమావేశమైంది. తాజాగా, త్రివిధ దళాలుతో మోడీ సమావేశం కావడం గమనార్హం.
ఇప్పటికే పాకిస్తాన్‌పై భారత్ దౌత్య యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ 80 శాతం జనాభాకు జీవనాడి అయిన ‘‘సింధు నది’’కి సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’రద్దు చేసింది. దీంతో పాటు పాక్ జాతీయుల వీసాలను రద్దు చేసి, దేశం వదిలి వెళ్లాలని డెడ్‌లైన్ విధించింది. అట్టారీ-వాఘా బోర్డర్‌ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఇప్పుడు మిలిటరీ యాక్షన్‌కి కూడా ప్రధాని మోడీ పర్మిషన్ ఇవ్వడం సంచలనంగా మారింది. మిలిటరీ యాక్షన్ తీసుకుంటారా..?, లేక పూర్తి స్థాయి యుద్ధానికి జరుగుతుందా..? అనేది ప్రజల్లో ఆసక్తి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com