Parliament session : లోక్ సభ వాయిదా, రాజ్యసభ తిరిగి ప్రారంభం

Parliament session : లోక్ సభ  వాయిదా,  రాజ్యసభ  తిరిగి ప్రారంభం
మణిపూర్ నిరసనలతో వేడెక్కిన సభలు

ప్రతిపక్షాల నిరసనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. లోక్ సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తర సమయంలో ప్రతిపక్షాలు మణిపూర్ అంశంపై నిరసనలు తెలియజేస్తూ ఆందోళనకు దిగారు. మణిపూర్ పై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మళ్లీ అదే వైఖరితో విపక్షాలు ఆందోళనలు చేస్తూ ప్లకార్డులతో నినాదాలు చేయడంతో సభలు మాటిమాటికీ వాయిదాలు పడుతున్నాయి.

కేంద్రం ఈరోజు రాజ్యసభ ముందుకు 6 బిల్లులు తీసుకురానుంది. వీటిలో రెండు బిల్లులను ప్రవేశ పెట్టడంతో సహా నాలుగు బిల్లులపై చర్చ ఆమోదానికి పెట్టింది. న్యాయవాదుల (సవరణ) బిల్లు 2023, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023 ను కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. అలాగే మధ్యవర్తిత్వ బిల్లు 2021, మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు, 2023 జీవ వైవిధ్యం సవరణ బిల్లు, అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లులపై చర్చ జరగనుంది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

న్యాయవాదుల చట్టం, 1961ని సవరించడానికి రాజ్యసభలో న్యాయవాదుల (సవరణ) బిల్లు, 2023ని, అలాగే మధ్యవర్తిత్వ బిల్లు, 2021ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. వివాదాల పరిష్కారం, వాణిజ్యపరమైన లేదా ఇతరత్రా, మధ్యవర్తిత్వ పరిష్కార ఒప్పందాలను అమలు చేయడం కోసం మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి సులభతరం చేయడానికి మధ్యవర్తిత్వానికి, ప్రత్యేకించి సంస్థాగత మధ్యవర్తిత్వానికి బిల్లు ఉపయోగపడనుంది.

ఇక మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు, 2023ని రాజ్యసభలో కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనుండగా, జీవ వైవిధ్య (సవరణ) బిల్లు, 2023,అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు 2023ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story