మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి : ఎంపీ కనకమేడల

మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి : ఎంపీ కనకమేడల
3 రాజధానుల అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. ప్రజాధనాన్ని వృధా చేస్తూ, రైతులకు నష్టం కలిగించేలా.... తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంపై కేంద్రం జోక్యం..

3 రాజధానుల అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. ప్రజాధనాన్ని వృధా చేస్తూ, రైతులకు నష్టం కలిగించేలా....తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ స్వయంగా భూమిపూజలో పాల్గొన్న....అమరావతి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైందని అన్నారు. స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద కేంద్రం అమరావతిని ఎంపిక చేసిందని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం ఎలాంటి సహేతుకమైన...కారణాలు లేకుండానే అమరావతిని నిర్వీర్యం చేసిందని అన్నారు కనకమేడల. యూపీ,రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఒక్క రాజధాని మాత్రమే ఉందని..13 జిల్లాలున్న ఏపీలో 3 రాజధానులా అంటూ ప్రశ్నించారు.కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు కనకమేడల.

Tags

Next Story