Mukesh Ambani: న్యూయార్క్‌లో హోటల్‌ను కొనుగోలు చేసిన అంబానీ.. విలువ అక్షరాల 700 కోట్లు..

Mukesh Ambani (tv5news.in)
Mukesh Ambani: ముఖేష్ అంబానీ.. నిమిషానికి నిమిషానికి తన ఆస్తులను పెంచుకుంటూ ఎవరూ అందనంత ఎత్తుకు ఎదుగుతున్న బిజినెస్‌మెన్. ముఖేష్ అంబానీ ఆస్తుల విలువలు ఎంత ఉంటాయో తెలుసుకోవాలంటే ఒకరోజు సరిపోదు అనుకుంటూ ఉంటారు కొందరు. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత తాజాగా 98 మిలియన్ డాలర్లు పెట్టి ఓ హోటల్‌ను కొనుగోలు చేశాడు. ఆ ధర విన్న ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
న్యూయర్క్‌లోని మ్యాండరిన్ ఓరియెంటల్.. అది ఒక హోటల్. కానీ మామూలు సాదాసీదా హోటల్ కాదు.. కేవలం సౌకర్యం కోసం ఎంతైనా ఖర్చుపెట్టగలిగే వారు మాత్రమే ఉండగలిగే హోటల్. ఇది 2003లో ప్రారంభమయ్యింది. 80 కొలంబస్ సర్కిల్‌లో ఉన్న మ్యాండరిన్ ఓరియెంటల్.. ప్రిస్టిన్ సెంట్రల్ పార్క్ సమీపంలోనే ఉంటుంది. ఇప్పటికీ మ్యాండరిన్ న్యూయార్క్‌కు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి.
అయితే ఇప్పటినుండి మ్యాండరిన్ ఓరియెంటల్‌లో ఎక్కువ భాగస్వామ్యంతో ఓనర్‌గా వెలగనున్నాడు ముఖేష్ అంబానీ. ఇటీవల ఆ హోటల్‌లోని 73.37 శాతాన్ని కొనుగోలు చేశాడు అంబానీ. అది కూడా 98.15 మిలియన్ల డాలర్లు పెట్టి. అంటే ఇండియన్ కరెన్సీలో దీని విలువ ఏకంగా రూ.720.75 కోట్లు. ఈ ధర విన్న అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం అంబానీకి ఇవన్నీ మామూలు విషయం అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com